YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి తెలంగాణ

ఇంజనీరింగ్ కాలేజీలకు దూరంగా స్టూడెంట్స్

ఇంజనీరింగ్ కాలేజీలకు దూరంగా స్టూడెంట్స్

ఇంజనీరింగ్ కాలేజీలకు దూరంగా స్టూడెంట్స్
హైద్రాబాద్, 
ఇంజినీరింగ్ కాలేజీ అంటే ఒకప్పుడు.. మామూలు క్రేజ్ ఉండేది కాదు.. ఎంసెట్ లో ఎంత ర్యాంకు వచ్చినా ఫీ రియంబర్స్ మెంట్ సాయంతో  ఇంజనీరింగ్ లో ఏదో ఒక కోర్సు తీసుకుని జాయిన్ అయ్యేవారు. ఇప్పుడు పరిస్థితి మారింది. ఇంజనీరింగ్ వైపు వెళ్లేందుకు స్టూడెంట్స్ అంతగా ఇష్టపడటం లేదు. ఫ్రీగా వచ్చే కోర్సులు చేసే కంటే.. తమ భవిష్యత్ కు ఉపయోగపడే కోర్సులపై దృష్టి పెడుతున్నారు విద్యార్థులు.రాష్ట్రం ఏర్పడే నాటికి తెలంగాణలో 354 ఇంజినీరింగ్ కాలేజీలున్నాయి. 2018 నాటికి వాటి సంఖ్య 205కి పడిపోయింది. 150 కాలేజీలు క్లోజ్ అయినట్లు అధికారుల లెక్కలు చెప్తున్నాయి. ఇక 2015లో లక్షా 15 వేల 912 సీట్లు అందుబాటులో ఉంటే.. అడ్మిషన్లు పూర్తైనవి 79 వేల 792 మాత్రమే అంటోంది ఉన్నత విద్యామండలి. 2018లో  96 వేల 228 సీట్లకు  61 వెయ్యి 989 సీట్లు  ఫిలప్ అయ్యాయి. ఇంజినీరింగ్ విద్యార్థుల సంఖ్య తగ్గడంతోనే కాలేజీలు మూతపడుతున్నాయంటున్నారు  ఉన్నత విద్యామండలి అధికారులు.ఇంజనీరింగ్ లో కంప్యూటర్ సైన్స్, ఇన్ ఫర్ మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, సివిల్ లాంటి కొన్ని  కోర్సులకు మాత్రమే డిమాండ్ ఉంది. మొత్తం 18 ఇంజినీరింగ్ కోర్సులుండగా… అందులో 12 కోర్సులపై విద్యార్థులు ఆసక్తి చూపడం లేదు. డిమాండ్ లేని కోర్సులతో కాలేజీలకు నష్టం వస్తుందని యాజమాన్యం కాలేజీలు మూసేస్తున్నాయంటున్నారు అధికారులు. ఇప్పటికే జెఎన్ టియూ కూడా డిమాండ్ లేని కోర్సులను మూసేసేందుకు దరఖాస్తులు పెట్టుకుంది. బీటెక్ 26, ఎంటెక్ 66, ఎంబీఏ 5, ఫార్మా 43 ఇలా మొత్తంగా 140 కాలేజీల నుంచి కోర్సుల రద్దుకు దరఖాస్తులు వచ్చాయంటున్నారు. వచ్చే విద్యాసంవత్సరానికి మరో 8 కాలేజీలు మూత పడతాయని చెబుతున్నారు.భవిష్యత్ లో హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న కాలేజీలే కొనసాగే అవకాశం ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న కాలేజీల్లో విద్యార్థుల సంఖ్య ఏటా తగ్గుతుందంటున్నారు ఉన్నత విద్యామండలి అధికారులు.

Related Posts