YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

రేషన్ బియ్యం లెక్కల్లో తేడాలు

రేషన్ బియ్యం లెక్కల్లో తేడాలు

రేషన్ బియ్యం లెక్కల్లో తేడాలు
నిజామాబాద్, 
రేషన్‌‌ లబ్ధిదారులకు అందించేందుకు సరఫరా చేసే బియ్యం తూకాల్లో తేడా వస్తోంది. మిల్లర్ల నుంచి గోదాములకు, గోదాముల నుంచి రేషన్‌‌ షాపులకు చేరేసరికి బస్తాల్లో బియ్యం కిలోల కొద్ది మాయమవుతోంది. పౌర సరఫరాల శాఖలో పలు సంస్కరణలతో మెరుగైన ప్రజా పంపిణీ వ్యవస్థను తీసుకువచ్చినట్లు  ప్రభుత్వం చెబుతోంది. ఈపోస్‌‌ ద్వారా నిజమైన లబ్ధిదారులకు రేషన్‌‌ అందిస్తోంది. ఈ పోస్ విధానంతో ఏటా దాదాపు  రూ.917 కోట్లు ఆదా అవుతున్నట్లు తెలుస్తోంది. ఇంత పారదర్శకంగా జరుగుతున్నా  నెల నెలా వెయ్యి టన్నులకు పైగా బియ్యం మాయమవుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి.  రేషన్‌‌ విధానంలో టెక్నాలజీని వినియోగిస్తున్న సివిల్ సప్లై విభాగం మిల్లర్లు, గోదాముల్లో జరుగుతున్న అక్రమాలపై దృష్టి పెట్టడం లేదు. ఫలితంగా రేషన్‌‌ షాపులకు చేరేసరికి బస్తాలో నిర్ణీత 50 కిలోలకు రెండు, మూడు కిలోల వరకు తగ్గుతోంది. కోటా కోతపై ప్రశ్నిస్తే తాము చేసే అక్రమాలు బయటపడతాయనే భయంతో ఇన్నాళ్లు చాలామంది డీలర్లు నోరు మెదపలేదు. ఈపోస్విధానం ప్రారంభమైన తర్వాత అక్రమ ఆదాయానికి గండి పడింది. దీంతో బియ్యం తక్కువ వస్తున్నట్లు ఒక్కొక్కరు నోరు విప్పుతున్నారు.రాష్ట్రంలో ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా 2,82,04,024 మంది లబ్ధిదారులు ప్రయోజనం పొందుతున్నారు.  రాష్ట్ర వ్యాప్తంగా 17,168 రేషన్‌‌ షాపులకు 1.78 లక్షల టన్నుల బియ్యాన్ని పౌర సరఫరాల శాఖ పంపిణీ  చేస్తోంది. రాష్ట్రంలో   బీపీఎల్‌‌ కార్డులు, ఎఫ్ఎస్‌‌సీ కార్డులు, ఏఎఫ్ఎస్‌‌సీ కార్డులు, ఏఏపీ కార్డులు మొత్తం కలిపి 87.93 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు. రేషన్‌‌ షాపులకు సరఫరా చేసే బియ్యం బస్తాలను టన్ను చొప్పున తూకం వేస్తారు. కనీసం టన్నుకు 10 కిలోల వరకు తగ్గుతున్నట్లు డీలర్లు ఆరోపిస్తున్నారు.  రాష్ట్రంలో సరఫరా అయ్యే 1.78 లక్షల టన్నుల బియ్యంలో వెయ్యి టన్నులకు పైగా తక్కువగా రేషన్‌‌ షాపులకు సరఫరా అవుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి.రైస్ మిల్లు నుంచి గోదాములకు, గోదాముల నుంచి రేషన్‌‌ షాపులకు వచ్చే ముందు ఈ తతంగం జరుగుతుందనే అనుమానం  వ్యక్తమవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా బార్బర్‌‌ షాప్‌‌లు, బ్యూటీపార్లర్లు మినహా  అన్ని షాపులు, వ్యాపార సంస్థలపై కొరఢా ఝుళిపించే తూనికలు కొలతల శాఖ మాతృ సంస్థపై దృష్టి సారించడం లేదు.  అడపాదడప సివిల్‌‌ సప్లై ఎన్‌‌ఫోర్స్‌‌మెంట్ దాడులు మినహా అధికార యంత్రాంగం పెద్దగా పట్టించుకోవడం లేదు.రేషన్ షాపులకు బియ్యం గోనే సంచుల్లో సరఫరా అవుతాయి. ఒక్కో గోనె సంచి బరువు 650 గ్రాములు ఉంటుంది. ఒక్కో బస్తాలో 50 కిలోల బియ్యం సరఫరా చేస్తారు. అంటే బస్తా బరువుతో సహా 50 కిలోల 650 గ్రాములుండాలి.  కానీ ఏ ఒక్క బస్తాలోనూ సరైన తూకం ఉండడం లేదు. హైదరాబాద్‌‌లో తక్కువలో తక్కువగా ఒక్క బస్తాలో కనీసం కిలో కోత ఉంటుంది. జిల్లాలు, పల్లెల్లో అయితే బస్తాకు రెండు, మూడు కేజీల బియ్యం తక్కువ వస్తున్నాయి. గత నెల మహబూబాబాద్‌‌ జిల్లా బయ్యారంలోని రేషన్‌‌ షాపునకు వచ్చిన 400 బస్తాల్లో కొన్ని కాంటా పెడితే యావరేజీగా ప్రతి బస్తాకు 3 కిలోలు తక్కువ వచ్చాయి. ఒక్క లారీ లోడులో 12 క్వింటాళ్లు తక్కువగా వచ్చాయని విమర్శలు వ్యక్తమయ్యాయి.రేషన్‌‌షాపుకు బియ్యం లోడు తక్కువగా వస్తోంది. గత నెలలో చెక్‌‌ చేస్తే బయ్యారం రేషన్‌‌ షాపులో బస్తాకు 3 కిలోలు  తగ్గాయి. ఒక బస్తాలో 44 కిలోల 920 గ్రాములు, 47 కిలోలు, 48 కిలోలు ఇలా యావరేజీగా బస్తాకు మూడు కిలోల చొప్పున తక్కువ వచ్చాయి. అధికారులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై చర్య తీసుకోవాలి.

Related Posts