YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి ఆంధ్ర ప్రదేశ్

సవాళ్లను ఎదుర్కోవాలి

సవాళ్లను ఎదుర్కోవాలి

సవాళ్లను ఎదుర్కోవాలి
అమరావతి
మంగళగిరి ఏపీఎస్పీ 6వ బెటాలియన్లో.. 2018 బ్యాచ్ డీఎస్పీల పాసింగ్ అవుట్ పరేడ్ నేడు జరిగింది. ఈ కార్యక్రమానికి హోంమంత్రి సుచరిత, డీజీపీ గౌతమ్సవాంగ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఏడాది పాటు అనంతపురం పీటీసీ లో శిక్షణ పొందిన 25 మంది డీఎస్పీలు, ఇప్పుడు  శిక్షణ పూర్తి చేసుకొని విధుల్లోకి వెళుతున్నారు.  ఇరవై ఐదు మందిలో పదకొండుమంది మహిళా డీఎస్పీలు వున్నారు. వారితో ఉన్నతాధికారులు ప్రతిజ్ఞ చేయించారు.  వారి గౌరవ వందన్నాని హోంమంత్రి మేకతోటి సుచరిత, డీజీపీ గౌతమ్ సవాంగ్ స్వీకరించారు.  శిక్షణ లో, విధుల్లో ప్రతిభ కనబరచిన సిబ్బందికి షీల్డ్స్ ను హోం మంత్రి సుచరిత అందచేసారు. ఈ సందర్భంగా డిజిపి గౌతమ్ సవాంగ్ మాట్లాడుతూ  ప్రొబెషనరీ డీఎస్పీలు వచ్చిన మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. శిక్షణ పూర్తి చేసుకున్న 25 మంది డిఎస్పీలకు నా అభినందనలు.  విధుల్లో అప్రమత్తం గా ఉంటూ.. సమాజానికి సేవలు అందించాలి. శాంతిభద్రతల పరిరక్షణ లో పోలీసులదే కీలక పాత్ర. సంఘ విద్రోహ శక్తుల దుశ్చర్యల పై కఠినంగా ఉండాలని అన్నారు.  వెనుకబడిన వర్గాలకు న్యాయం చేయడమే మన బాధ్యత అని సూచించారు. ప్రతిఒక్కరూ ఫిజికల్ ఫిట్ నెస్ పై శ్రద్ద పెట్టి యాక్టివ్ గా ఉండాలి. ప్రజలకు చేరువగా, అండగా ఉండేలా మన పోలీసింగ్ ఉండాలి. కేసు దర్యాప్తు లో పూర్తి స్థాయి ఆధారాలు సేకరించేలా దృష్టి సారించాలని అన్నారు. సాంకేతిక , శాస్త్రీయంగా సాక్ష్యాలు సేకరిస్తేనే నిందితులకు శిక్షలు పడతాయి. మానవ హక్కుల ఉల్లంఘన, అంటరానితనం వంటి దురాచారాలు లేకుండా చూడాలి. రోజు రోజుకు సైబర్ క్రైం పెరిగిపోతుంది.. డబ్బులు పోగొట్టుకుంటున్నారు. వైట్ కాలర్ నేరాలు కొత్త కొత్త కోణాల్లో జరుగుతున్నాయని అన్నారు. అనంతరం హోం మంత్రి సుచరిత మాట్లాడుతూ.. త్యాగం, సేవకు పోలీసులు నిదర్శనమన్నారు. గ్రామీణాభివృద్ధిలో పోలీసులు కీలకపాత్ర పోషించాలన్నారు. ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణిచివేయాలని సుచరిత పిలుపునిచ్చారు.  25మంది డిఎస్పీలలో 11మంది మహిళలు ఉండటం అభినందనీయమని అన్నారు. ఏ ఆపద వచ్చినా ముందుగా గుర్తు వచ్చేది పోలీసులే. పోలీస్ శాఖ, కుటుంబ సభ్యుల నమ్మకాన్ని నిలబెట్టాలి. మహిళల సమస్యలు సున్నితమైనవి... వారికి అండగా నిలవాలి. సైబర్ క్రైం, వైట్ కాలర్ నేరాలు, డ్రగ్స్ మాఫియా పెరుగుతుంది. 
నిరంతరం నిఘా ఉంచి..వాటిని నిరోధించేలా కృషి చేయాలి. పోలీస్ ల ఇబ్బందులు గుర్తించే సిఎం జగన్ వీక్లీ ఆఫ్ లు ప్రవేశపెట్టారని అన్నారు.  సమాజంలో ఎదురయ్యే అనేక సవాళ్లను ఎదుర్కొని ప్రజలకు అండగా ఉండాల్సిన బాధ్యత. పోలీసులదేనని అన్నారు. 

Related Posts