
మింట్ కాంపౌడ్‌లో విద్యుత్ కార్మికుల ధర్నా
హైదరాబాద్
మింట్ కాంపౌడ్‌లో విద్యుత్ కార్మికులు మహా ధర్నా నిర్వహించారు. తమ సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈపీఎఫ్ నుంచి జీపీఎఫ్ కార్మికులుగా గుర్తించాలని కోరారు. 23 వేల ఆరు వందల మంది ఆర్టిజిన్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలన్నారు. ఏపీఎస్ఈబీ రూల్స్‌ను వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. ఎస్పీఎమ్‌లో పనిచేస్తున్న కార్మికులను ఆర్టిజిన్ కింద గుర్తించాలన్నారు. ప్రమాదవశాత్తు మరణించిన ఆర్టిజిన్ ఉద్యోగుల కుటుంబాలకు ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 23వ తేదీన వరంగల్‌లో విద్యుత్ ఉద్యోగులు మహా ధర్నా నిర్వహించారు. 23వ తేదీ తర్వాత పరిష్కారం కాకపోతే సమ్మెలోకి వెళ్తామని ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేశారు.