YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

లోకేష్ ను కలిసిన పశు సఖీ మహిళలు

లోకేష్ ను కలిసిన పశు సఖీ మహిళలు

లోకేష్ ను కలిసిన పశు సఖీ మహిళలు
గుంటూరు
తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను  పశు సంవర్ధక శాఖలో పని చేస్తున్న పశు సఖి మహిళలు బుధవారం కలిసారు.  నాలుగు నెలల నుండి జీతాలు రావడం లేదని లోకేష్ దృష్టికి తీసుకెళ్లారు.  జీతాలు ఇవ్వకపోగా ఉద్యోగాలు తీసివేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. 6400 మంది ఉద్యోగాలను తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారని లోకేష్ కి వివరించారు. ధర్నాలు చేసినా,ర్యాలీలు చేసినా కనీసం ప్రభుత్వం మా సమస్య వినడానికి కూడా సిద్ధంగా లేదు.  కూలీ పని చేసుకోండి అంటూ అవమానించే విధంగా మాట్లాడారు అని తమ గోడు వెళ్లబోసుకున్ఆరు. తమ పోరాటానికి అండగా ఉండాలి  అని లోకేష్ ని కోరారు. లోకేష్ మాట్లాడుతూ నాలుగు  లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చాం అని చెప్పుకుంటూ 40 లక్షల మంది ఉద్యోగాలు తొలగించే కుట్ర జరుగుతుంది. కార్యకర్తలకు ఉద్యోగాలు ఇచ్చేందుకు అందరిని ఉద్యోగాల నుండి తొలగిస్తున్నారు. కనీసం సమస్య వినే ఓపిక కూడా ఈ ప్రభుత్వానికి ,మంత్రులకు లేదని అన్నారు. మీ ఉద్యమానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది. ఉద్యోగాల నుండి తొలగించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అంగన్వాడీ,ఉపాధి హామీ ,పశు సఖులు, ఆశా వర్కర్లు ఇలా ఎంతో మందిని ఉద్యోగాల నుండి తొలగిస్తున్నారు. అందరిని తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకునే విధంగా మీకు అండగా ఉంది పోరాటం చేస్తామని భరోసా ఇచ్చారు. 

Related Posts