విశాఖ లో గాంధీ సంకల్ప యాత్ర
విశాఖపట్నం,
విశాఖజిల్లా పాయకరావుపేటలో గాంధీ సంకల్పయాత్రను రాష్ట్ర బీజేపీ పార్టీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ బుధవారం ప్రారంభించారు. అంతకుముందు అయన పాండురంగ స్వామివారి దర్శనం చేసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ మహాత్మా గాంధీ150వ జయంతి సందర్భంగా మోడీ ఇచ్చిన పిలుపు మేరకు దేశవ్యాప్తంగా పాద యాత్ర చేస్తిన్నాము అని అన్నారు. గాంధీ ఇజం ఇస్తామని చెప్పి దాన్ని మార్చి కాంగ్రెస్ ఇజంతో నెహ్రూ పాలనతో సాగింది అని అన్నారు. మోడీ అధికారంలోకి వచ్చిన తరువాత దేశ వ్యాప్తంగా స్వచ్ భారత్ అనే కార్యక్రమం శ్రీకారం చుట్టారు. గాంధీ కలలు కన్న స్వరాజ్యం కోసం పాటు పడుతున్న వ్యక్తి మోడీ అని అన్నారు. పర్యావరణ పరిరక్షణ పేరుతో "సింగిల్ యూజ్"ప్లాస్టిక్ వస్తువులను వాడకూడదు అనే సిద్ధాంతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ కార్యక్రమం విశాఖ ఎమ్మెల్సీ మాధవన్ ఆధ్వర్యంలో నేడు పాయకరావుపేట నుండి ప్రారంభమై జిల్లాలో సాగుతూ ఈనెల30న భీమిలిలో ముగుస్తుంది అన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ హరిబాబు,తోటనగేష్,బీజేపీ నాయకులు,కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.