వరి పైర్లకు తెగుళ్లు....
ఆందోళనలో రైతులు...
తెగుళ్ళకు నివారణలు చేపట్టండి.. ఏ ఓ నరేష్
వనపర్తి
వరి పైర్లకు వివిధ రకాల తెగుళ్లు సోకడం వల్ల రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో పంటలకు సోకిన తేగుళ్లకు సరైన మందులను వాడి పంటలను కాపాడుకోవాలని ఏవో నరేష్ రైతులకు సూచనలు చేస్తున్నారు. వాతావరణంలోని మార్పుల వల్ల వరిలో సుడిదోమ, కంకి నల్లి మరియు కాండం తొలుచు పురుగు ఉన్నట్లు గమనించినట్లు ఏవో నరేష్ తెలిపారు. ఈ తెగుళ్ళకు తగిన పిచ్చి కారాలను చేస్తున్నామని రైతు నల్లబోతు శివ ఎస్ వి న్యూస్ బ్యూరోకు తెలిపారు. ఈ తెగుళ్ళకు బుధవారం రెండు వేల రూపాయలను వెచ్చించి మందులను తీసుకొచ్చానని, ఇప్పటికే నాలుగు మడుల వరి పైరు తెగుళ్ళ వల్ల పాడయి పోయిందని ఆయన ఆవేదన వ్యక్తపరిచారు. అందులో భాగంగానే వరి సోకిన తెగుళ్ళ వల్ల రైతులు నష్టపోకూడదనే ఉద్దేశంతో ప్రతిరోజు ఉదయమే వరి పంటలను పరిశీలన చేస్తున్నానని ఏవో నరేష్ తెలిపారు. ఈ తెగుళ్ల నివారణ కోసం తగిన మందులు వాడాలంటూ రైతులకు సూచనలు సలహాలు ఇవ్వడం జరుగుతుందని ఆయన తెలిపారు.