గల్ఫ్ కార్మికుల గుండెపోటు మరణాలపై జగిత్యాల జిల్లాలో అధ్యయనం
జగిత్యాల
గల్ఫ్ దేశాలలో వలస కార్మికులు వేడి వాతావరణంలో పనిచేయడం, శారీరక, మానసిక ఒత్తిడి నేపథ్యంలో హృదయ సంభందిత అనారోగ్యం, గుండెపోటు వలన చనిపోవడానికి దారి తీస్తున్న పరిస్థితులు, కారణాలు నివారణ అనే అంశంపై అధ్యయనం చేయడానికి బెంగుళూరుకు చెందిన నిఖిల్ ఈపెన్ అనే పరిశోధకుడు ఉత్తర తెలంగాణ జిల్లాల పర్యటనకు రాగా, బుధవారం నాడు జిల్లా లోని మేడిపల్లి మండలం కమ్మర్ పల్లి, మన్నెగూడెం, మెట్ పెల్లి మండలం మెట్ల చిట్టాపూర్ గ్రామాల్లో గల్ఫ్ మృతుల కుటుంబాలు కలసి మాట్లాడారు. మంగళవారం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పర్యటించారు.
ఎమిగ్రంట్స్ వెల్ఫేర్ ఫోరమ్ అధ్యక్షులు మంద భీంరెడ్ది, ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్ ఆర్గనైజింగ్ కార్యదర్శి జయపాల్, న్యాయవాది చెన్న విశ్వనాథం లు పరిశోధకుడు నిఖిల్ వెంట ఉన్నారు.