సెలవులు రద్దు చేసి పాఠశాల ప్రారంభించానులి
తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయు సంఘం తపస్
జగిత్యాల
తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తపస్ ఆధ్వర్యంలో బుధవారం రాష్ట్రంలో విద్యా సంస్థలకు ఇచ్చిన సెలవులను వెంటనే రద్దు చేసి పాఠశాలలు ప్రారంభించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ డాక్టర్. ఏ.శరత్ , ఆర్ డి ఓ నరేందర్ లకు బుధవారం వినతి పత్రం సమర్పించారు.ఆనంతరం ఈసందర్భంగా తపస్ సంఘం నాయకులు మాట్లాడుతూ పాఠశాలలు మూసి వేయడం వల్ల విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు.విద్యార్థుల సెలబాస్ ఇప్పటి వరకు పూర్తి కాలేదని విద్యార్థులు ఆవేదన చెందుతున్నరన్నారు.వెంటనే పాఠశాలలు ప్రారంభించి సెలబస్ పూర్తి చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో జగిత్యాల జిల్లా అధ్యక్షులు నరేందర్ రావు ,ప్రధాన కార్యదర్శి వోద్నల రాజశేఖర్ ,రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి బోనగిరి దేవయ్య, జిల్లా సంఘటన కార్యదర్శి గడ్డం మహిపాల్ రెడ్డి,జిల్లా బాధ్యులు సంది శ్రీనివాస్ రెడ్డి, వేణుగోపాలరావు పట్టణాధ్యక్షుడు ఆనందరావు మండల ప్రధాన కార్యదర్శి బొమ్మకంటి శ్రీనివాస్, కుర్మాచలం రఘునందన్ ,జంగిలి గంగాధర్ పాల్గొన్నారు