YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

చేనేత కుటుంబాలకు ఆర్ధిక చేయుత

చేనేత కుటుంబాలకు ఆర్ధిక చేయుత

చేనేత కుటుంబాలకు ఆర్ధిక చేయుత
‘వైయస్సార్ చేనేత హస్తం’ ప్రారంభించనున్న సర్కార్
అమరావతి  
అమరావతిలో బుధవారం రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం ముగిసింది. ఈ భేటీలో మంత్రివర్గం మరో కొత్త పథకానికి ఆమోదముద్ర వేసింది. చేనేత కుటుంబాలకు ఏడాదికి రూ. 24 వేల ఆర్థిక సాయాన్ని 'వైయస్సార్ చేనేత హస్తం' పేరుతో అందించాలనే నిర్ణయాన్ని కేబినెట్ ఆమోదించింది. ఈ మొత్తాన్ని ఒకే విడతలో అందించాలని నిర్ణయించారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని 90 వేల కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. ఈ పథకానికి ఏడాదికి రూ. 216 కోట్ల మేర ఖర్చవుతుందని అంచనా వేశారు. మంత్రివర్గ భేటీ వివరాలను మంత్రి పేర్ని నాని మీడియాకు వివరించారు. ప్రతి సంవత్సరం చేనేత కార్మికులకు రూ.24వేల ఆర్థికసాయం అందజేయనున్నట్లు  మంత్రి  తెలిపారు.  డిసెంబర్ 21 నుంచి వైఎస్ఆర్ చేనేత నేస్తం పథకం అమలవుతుందన్నారు. మగ్గంపై ఆధారపడి జీవిస్తున్న నేతన్నలను గుర్తించేందుకు సర్వే జరుగుతోందని, అక్టోబర్ మాసంలోపు జాబితాను గ్రామసభల్లో ప్రదర్శిస్తామన్నారు. అందులో తప్పులు, అనర్హులున్నా, అర్హులకు స్థానం లేకపోతే..జాబితాల్లో చేరుస్తామన్నారు. డిసెంబర్లో సీఎం జగన్ చేతుల మీదుగా పథకం ప్రారంభిస్తామన్నారు  న్యాయవాదులకు రూ.5వేల ఆర్థికసాయం చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు  మంత్రి  తెలిపారు. జిల్లాల వారీగా వాటర్ గ్రిడ్ ఏర్పాటుకు మంత్రివర్గ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అలాగే మత్స్యకారుల బోట్లకు ఇచ్చే డీజిల్ సబ్సిడీని పెంచుతున్నట్లు  తెలిపారు. వేట నిషేధ కాలంలో ప్రతి మత్స్య కార్మికుడికి రూ. 10 వేలు అందివ్వాలని నిర్ణయం. మోటార్ బోట్లు, మోటార్ లేని బోట్లు లేని కుటుంబాలే కాకుండా..తెప్పలపై జీవనం సాగిస్తున్న వారిని పథకంలో భాగస్వాములు చేయాలని, నవంబర్ 21 అంతర్జాతీయ మత్స్య దినోత్సవం రోజున..సీఎం జగన్ పథకాన్ని ప్రారంభించేందుకు మంత్రివర్గం నిర్ణయించింది.  మధ్యాహ్న భోజన కార్మికుల గౌరవ వేతనం రూ.3వేలకు పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుందని తెలిపారు.  హోంగార్డులకు ఇచ్చే రోజువారీ భత్యం రూ.710 పెంపునకు మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. పొరుగుసేవల ఉద్యోగాల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుకు నిర్ణయించామన్నారు. సాధారణ పరిపాలనశాఖ అజమాయిషీలో పొరుగుసేవల కార్పొరేషన్ ఉంటుందన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో బోర్లు వేసేందుకు రిగ్ లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

Related Posts