YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

ఆర్టికల్ 370 రద్దుపై  విచారణ .... కేంద్రంపై సుప్రీం ఆగ్రహం

ఆర్టికల్ 370 రద్దుపై  విచారణ .... కేంద్రంపై సుప్రీం ఆగ్రహం

ఆర్టికల్ 370 రద్దుపై  విచారణ .... కేంద్రంపై సుప్రీం ఆగ్రహం
న్యూఢిల్లీ, 
ఆర్టికల్‌ 370 రద్దు అనంతరం కేంద్రం, జమ్మూకశ్మీర్‌ సర్కారు తీరును తప్పుబడుతూ పెద్ద ఎత్తున సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలైన సంగతి తెలిసిందే. వీటిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. ఆసిఫా ముబీన్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై అఫిడవిట్‌ రూపంలో సమాధానం ఎందుకు ఇవ్వలేదంటూ కేంద్రం, కశ్మీర్‌ సర్కార్లను నిలదీసింది. ఎన్నారై అయిన తన భర్తను అదుపులోకి తీసుకున్నారని, ఇది వ్యక్తిగత స్వేచ్ఛను హరించడమేనని ఆసిఫా సుప్రీంకోర్టును ఆశ్రయించారు.సుప్రీంకోర్టు ఆగ్రహంతో కశ్మీర్‌ ప్రభుత్వం స్పందిస్తూ.. ఐదు నిమిషాల్లో అఫిడవిట్‌ దాఖలు చేస్తామని పేర్కొంది. ఎంతోమంది పిటిషన్లు వేశారని, అందువల్లే అఫిడవిట్‌ దాఖలు చేయడంలో జాప్యమైందని సొలిసిటర్‌ జనరల్‌ పేర్కొన్నారు. కశ్మీర్‌లో నిర్బంధంపై అఫిడవిట్లు దాఖలు చేయకపోవడాన్ని తీవ్రంగా తప్పుబట్టిన సుప్రీంకోర్టు.. తమ ఆదేశాల పట్ల ఉదాసీనంగా వ్యవహరించరాదంటూ కేంద్రం, కశ్మీర్‌ సర్కార్‌లను మందలించింది.

Related Posts