YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఉగాది నుంచి 'పెళ్లి కానుక'

Highlights

 

  • డ్వాక్రా సంఘాల ద్వారా అమలు
  • సిఎం చంద్రబాబు
ఉగాది నుంచి 'పెళ్లి కానుక'


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో కొనసాగుతున్న చంద్రన్న కానుకల పరంపరలో మరో కానుక ఆవిష్కృతమైంది. ఈ నెల 18 నిర్వహించకోబోయే ఉగాది పర్వదినాన్ని పురష్కరించుకుని  రాష్ట్రంలో 'పెళ్లికానుక' పధకం అందుబాటులోకి రానున్నది. ఈ పథకం అమలు బాధ్యతను డ్వాక్రా సంఘాలకు అప్పగిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. 'స్వయం సహాయక బృందాల సాధికారత' అంశంపై శాసనసభలో బుధవారం జరిగిన చర్చకు ఆయన సమాధానమిస్తూ ఈ పధకం ఎస్టీ, మైనారిటీలకు రూ.50వేలు, ఎస్సీలకు రూ.40 వేలు, బిసిలకు రూ.35 వేలు అందజేయనున్నట్లు చెప్పారు. ఈ మొత్తంలో 20 శాతం ఖర్చుల కోసం పెళ్లికి ముందే అందజేస్తామని, 80 శాతాన్ని పెళ్లిరోజు వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తామన్నారు.  డిజిటల్ అసిస్టెన్స్ను డ్వాక్రా సంఘాలకే కేటాయించినట్లు చెప్పారు. డ్వాక్రా సంఘాల నిర్వహణలో దేశంలోనే రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉందన్నారు. డ్వాక్రా సంఘాలకు 'పసుపు-కుంకుమ'లో భాగంగా రూ.8,000 కోట్లు విడుదల చేశామని, మరో రూ.2 వేల కోట్లు విడుదల చేయాల్సి ఉందన్నారు. కేంద్రం 9.50 లక్షల మందికే పింఛన్లు ఇస్తున్నా, రాష్ట్రం ప్రభుత్వం 50 లక్షల మందికి రూ.1,000 చొప్పున పింఛను చెల్లిస్తోందన్నారు. వడ్డీ మాఫీ పధకంలో రూ.2,514 కోట్లు చెల్లించినట్లు చెప్పారు. ప్రతి కుటుంబానికీ నెలకు కనీసం రూ.10 వేలు ఆదాయం వచ్చే విధంగా ప్రణాళికల్ని రూపొందించినట్లు తెలిపారు. .ప్రతి ఎమ్మెల్యే వారి నియోజకవర్గాన్ని పేదరిక రహితంగా తీర్చిదిద్దాలని, ఇందుకు ప్రభుత్వం అన్ని రకాలుగా సహకరిస్తోందన్నారు. పేద కుటుంబాల ఖర్చుల్ని తగ్గించడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామన్నారు.

Related Posts