YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు ఆంధ్ర ప్రదేశ్

విలేకరి  హత్య విచారణకు ఆదేశం

విలేకరి  హత్య విచారణకు ఆదేశం

విలేకరి  హత్య
విచారణకు ఆదేశం
కాకినాడ, 
ఏపీలో ఓ పత్రికా విలేకరి దారుణంగా హత్యకు గురయ్యారు. తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలంలో ఆంధ్రజ్యోతి విలేకరిగా పనిచేస్తున్న కాతా సత్యనారాయణ (45)ను దుండగులు కిరాతకంగా నరికి చంపారు. ఎస్.అన్నవరం గ్రామ సమీపంలోని లక్ష్మీదేవి చెరువు గట్టుపై విలేకరిని అడ్డగించిన దుండగులు కత్తులతో దాడి చేసి చంపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.సత్యనారాయణ మృతి వార్తతో కుటుంబంలో తీరని విషాదం అలుముకుంది. బంధువులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. విలేకరి సత్యనారాయణ హత్యను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ఈ కేసును సీరియస్‌గా తీసుకుని నిందితులను వీలైనంత త్వరగా పట్టుకోవాలని డీజీపీని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. ఘటనపై తూర్పు గోదావరి జిల్లా ఎస్పీతో డీజీపీ సవాంగ్ మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. తక్షణం సంఘటనా స్థలానికి వెళ్లి పూర్తి వివరాలు తెలుసుకోవాలని ఎస్పీని డీజీపీ ఆదేశించారు.జర్నలిస్ట్ హత్య చాలా దారుణమైన ఘటన అని డీజీపీ ఖండించారు. ఈ కేసును స్వయంగా పర్యవేక్షించి వీలైనంత త్వరగా నిందితులను పట్టుకోవాలంటూ తూర్పు గోదావరి జిల్లా ఎస్పీని ఆదేశించారు.

Related Posts