చంద్రబాబు నీతులు చెప్పడం విడ్డూరం
కడప అక్టోబర్ 16 (న్యూస్ పల్స్):
పాదయాత్ర లో ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఒక్కొక్కటి అమలు చేస్తున్నారు. రైతులకు పెట్టుబడి సహాయంగా రైతు భరోసా డబ్బులను ఖాతాలో వేశారు. వచ్చే ఏడాది నుంచి ఇస్తామని ఈ ఏడాది నుండే ఇచ్చిన ఘనత వైఎస్ జగన్ దని వైఎస్సార్ కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి సి. రామచంద్రయ్య అన్నారు. బుధవారం అయన మీడియాతో మాట్లాడారు. పథకమే నిన్న ప్రారంభం అవుతుంటే అవకతవకలు జరిగాయని టీడీపీ నేతలు అనడం హాస్యాస్పదం. టీడీపీ నేతల తీరును ప్రజలు గమనిస్తున్నారు. దీనిపై లబ్ధిదారులు ఫిర్యాదు చేశారా... మరి టీడీపీ నేతలకు ఎందుకు దురద అని ప్రశ్నించారు. గత చంద్రబాబు హయాంలో రైతులను నిలువునా ముంచారు. ఉమ్మడి రాష్ట్రంలో కరువు వచ్చి రైతులు అల్లాడుతున్నా పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేసారు. వ్యవసాయం దండగ అని అన్న ఘనుడు చంద్రబాబు. 2004 లో వైఎస్ ప్రవేశ పెట్టిన ఉచిత విద్యుత్ ను చంద్రబాబు వ్యతిరేకించిన మాట వాస్తవమా కాదా. రైతులను నిలువునా ముంచేసి ఈరోజు చంద్రబాబు నీతులు చెప్పడం విడ్డురమని అన్నారు. రాష్ట్రాన్ని దివాళా తీయించిన చంద్రబాబు వైఎస్ జగన్ ను విమర్శించే అర్హత లేదు. రివర్స్ టెండరింగ్ ద్వారా 1500 కోట్లు ఆదా అయిందా లేదా చంద్రబాబు సమాధానం చెప్పాలి...? కెమెరా ముందు యాక్షన్ చేసే నాయకుడు చంద్రబాబు.. కార్యకర్తల ను చూసి మాట్లాడే ధైర్యం కూడా లేదని విమర్శించారు. నవరత్నాలను నవగ్రహాలు అని చంద్రబాబు అనడం సిగ్గుచేటు. చంద్రబాబు కుంభకోణం బయట పడుతుందని మోడీ అంటే ద్వేషం లేదంటున్నారు. అందితే కాళ్ళు, అందకపోతే జుట్టు లా చంద్రబాబు తయారయ్యారు. తన బినామిలను, బ్రోకర్లను మధ్యవర్తిత్వం కోసం బీజేపీ లోకి పంపారు. టీడీపీ ని బీజేపీ లో విలీనం చేస్తే బాగుంటుంది. చంద్రబాబు కు వేరే ప్రత్యామ్నాయం లేదు. చంద్రబాబు ను దగ్గరకు తీసే సాహసం బీజేపీ చేస్తే అభాసు పాలు తప్పదని అయన వ్యాఖ్యానించారు.