పరిసరాల పరిశుభ్రత తోనే వ్యాధులు నివారణ సాధ్యం
- మున్సిపల్ కమిషనర్ ఎండి అయాజ్
జగిత్యాల
నన్రిసరాల పరిశుభ్రత తోనే వ్యాధులు నివారించవచ్చని కోరుట్ల మున్సిపల్ కమిషనర్ ఎండి అయాజ్ అన్నారు. బుధవారం కోరుట్ల పట్టణంలో స్వచ్ఛ సర్వేక్షన్ కార్యక్రమంలో భాగంగా వార్డులలో పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. వార్డులలో చెత్త సేకరించే మున్సిపల్ వాహనాలను తనిఖీ చేసి , వివరాలను కార్మికులకు అడిగి తెలుసుకున్నారు . తడి పొడి చెత్త వేరు చేయడానికి ప్రభుత్వం అందించిన గ్రీన్,బ్లూ చెత్త డబ్బులు లను వాడాలని ప్రజలకు సూచించారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ 50 మైక్రాన్ కన్న తక్కువ గల పాలిథిన్ కవర్లు వాడినట్లయితే క్యాన్సర్ రోగాల బారిన పడే అవకాశం ఉందని అన్నారు. పట్టణ ప్రజలు కిరాణం దుకాణాలకు వెళ్ళేటప్పుడు తమ వెంట బట్ట సంచులు తీసుకో వెళ్ళలని సూచించారు. ఒకవేళ ప్లాస్టిక్ కవర్ వాడినచో మొదటిసారిగా 5 వేల నుంచి 25 వేల రూపాయల వరకు, రెండోసారి 25 వేల నుండి 1లక్ష రూపాయల వరకు జరిమానా విధించి ట్రేడ్ లైసెన్స్ రద్దుపరచి దుకాణాలు సీజ్ చేస్తామని దుకాణాల దారులకు హెచ్చరించారు. పట్టణ ప్రజలు, వ్యాపారస్తులు అందరూ ప్లాస్టిక్ వాడకుండా ప్లాస్టిక్ రహిత కోరుట్ల గా మార్చుటకు తన వంతు సహకరించాలని కొరారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జి సానిటరీ ఇన్స్పెక్టర్ రాజయ్య, తో పాటు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు