YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

అమృత స్కీమ్‌ కింద రోడ్లు వేస్తున్నారు... తాగు నీరు కోసం రోడ్లు తవ్వుతున్నారు

అమృత స్కీమ్‌ కింద రోడ్లు వేస్తున్నారు... తాగు నీరు కోసం రోడ్లు తవ్వుతున్నారు

అమృత స్కీమ్‌ కింద రోడ్లు వేస్తున్నారు...
తాగు నీరు కోసం రోడ్లు తవ్వుతున్నారు
కర్నూలు, 
ఓ వైపు అధికారులు అభివృద్ధి పనులు చేస్తున్నామంటూ ప్రజలను ఇక్కట్లకు గురి చేస్తున్నారు. అభివృద్ధిలో భాగంగా ఇటీవల అధికార నాయకులు వార్డుల్లో సిసి రోడ్లను అవసరమైన చోట వేశారు. అయితే అవి మూణ్నాళ్ల ముచ్చగానే మిగిలిపోయాయి. తాజాగా ఇంటింటికీ తాగునీటి కుళాయి కనెక్షన్‌లు వేస్తున్నారంటూ నూతనంగా వేసిన రోడ్లనే తవ్వేస్తున్నారు. దీంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అభివృద్ధి పేరుతో రోడ్లు వేయడమెందుకు, ఇలా చేయడమెందుకనీ ప్రజలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు.చంద్రన్న బాట పేరుతో పల్లెల్లోను, వార్డుల్లోను ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన సిసిరోడ్లను చూసి ప్రజలు ఆనందించేలోపే అమృత స్కీమ్‌ పేరుతో వేసిన రోడ్లను తవ్వుకుంటూ పోవడం తవ్విన రోడ్లను పూడ్చకుంటా వదిలేయడంతో స్థానికులు, ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లక్షలు ఖర్చుపెట్టి రోడ్లు వేయడం బాగానే ఉన్నా అవే రోడ్లను పైపులైన్ల కోసం తవ్వడంతో వేసిన రోడ్లుపై పెద్దపెద్ద గోతులు పడుతున్నాయి. అసలు ప్రభుత్వ పథకాలు ముందుగానే నిర్థేశించి వాటికి అనుగుణంగా నిధులు కేటాయిస్తున్నప్పుడు మొదట సిసి రోడ్లు వేసి, తర్వాత అమృత పథకం కోసం రోడ్లను తవ్వడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం, అధికారులు చేస్తున్న ఈచర్యలకు ప్రజలు నానా ఇబ్బందులకు గురవుతున్నారు. పట్టణంలో అనేక ప్రాంతాల్లో సిసి రోడ్లు వేసి నెల రోజులు కాక మునుపే ప్రతి ఇంటికి మంచినీటి కుళాయి కనెక్షన్లు ఇచ్చే పథకంలో పేరుతో తవేస్తున్నారు. దీని వలన రోడ్లు కుదించుకుపోయి వాహనదారులు, పాదచారులు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అసలు రోడ్లు వేసేటప్పుడే ఈ పథకం గురించి పక్కా సమాచారం ఉన్నప్పుడు జివిఎంసి, ఇంజనీరింగ్‌ విభాగం అధికారులు అందుకు అనుగుణంగా ప్రణాళికలు వేసుకొని పనులు చేపట్టాల్సి ఉన్నప్పటికీ ఇక్కడ ఆవిధంగా చేయడం లేదు. మొదట సిసి రోడ్లకు నిధులు ఇచ్చి కాంట్రాక్టర్ల జేబులు నింపి కమీషన్లు దండుకున్న అధికారులు పైపులైన్ల కోసం మరొకరికి కాంట్రాక్టులు అందించి వేసిన రోడ్లనే తవ్వుకుంటూ పోతున్నారు. దీని బదులు రోడ్లు వేయకుండా ఉన్నా బాగుండేదని పలువురు విమర్శిస్తున్నారు. అయితే కొత్తగా వేసిన రోడ్లు మాత్రం గతంలో ఉన్న పాతరోడ్లను మించిపోయి గోతులతో నిండిపోయాయి. దీంతో పాదచారులు సైతం నడిచేందుకు నరకం చూస్తుంటే, ఇంక వాహనదారుల పరిస్థితి చెప్పాల్సిన పనే లేదు. తక్షణమే అధికారులు వీటిపై దృష్టి సారించాలని తవ్విన రోడ్ల స్థానంలో పైపులు వేసి యధావిధిగా రోడ్లు వచ్చేలా మరమ్మతులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

Related Posts