సమభావం
కొన్ని కర్మలు చేసినా ఆ కర్మల వాసనలు ఎలా అంటుకోకుండా
ఉంటాయి దానినే సమభావము అంటారు. దానికి కావాల్సింది నిశ్చయాత్మక బుద్ధి, సుఖము, దు:ఖము. లాభము. నష్టము, జయము అపజయము ఇవి ద్వంద్వములు. వీటి పట్ల సమభావం కలిగి ఉంటే, ఆ కర్మల వలన ఉత్పన్నమయే వాసనలు మనకు అంటవు, కాబట్టి సుఖము, లాభము, జయము కలిగినపుడు పొంగి పోవడం, దానికి వ్యతిరేకంగా జరిగితే కుంగి పోవడం మంచిది కాదు. ఒక కర్మచేస్తే ఏదో ఒకఫలితం వస్తుంది. తప్పదు. అది ముందు మనకు తెలియదు. వచ్చిన తరువాత అనుభవించడమే మన కర్తవ్యము. కాబట్టి వాటిపట్ల సమభావం ఉంటే మనస్సు శాంతిగా సుఖంగా ఉంటుంది.
కర్తవ్యములు అంటే చేయవలసిన పనులు. ఇవి రెండు రకాలు. ఒకటి సంతోషంతో చేయవలసిన పని. అంటే మనకు ఇష్టమైన, మనం ఇష్టంతో చేసే పని. రెండవది మనకు ఇష్టం లేకపోయినా బలవంతంగా చేసే పని. దుఃఖమును కలిగించే పని. మొదటిది మనకు ఇష్టమైన పని కాబట్టి ఇష్టంగా చేస్తాము. రెండవది ఇష్టం లేని పని కాబట్టి ఏడుస్తూ చెయ్యాల్సివచ్చిందే అనిచేస్తాము. కాని రెండు చేయవలసిన పనులే. తప్పించుకొనేవి కావు. కాబట్టి వీటియందు సమత్వం పాటిస్తే ఏ చిక్కు ఉండదు అని చెబుతున్నాడు భగవానుడు.హిమాలయాలలో, ఎవరూ లేని చోట, సమత్వం పాటించడం గొప్ప కాదు. అక్కడ ఎవరూ లేరు కాబట్టి సముత్వం దానంతట అదే వస్తుంది. కాని, ప్రాపంచిక విషయములు అనుభవిస్తూ ప్రపంచంలో తిరుగుతూ సమత్వము పాటించడమే ఒక యోగము అని భగవానుడు అంటాడు. మనస్సులో సమత్వం లేకపోతే అది ఆలోచించలేదు. మనస్సు పనిచేయడం మానేస్తుంది. అంతేకానీ దేవుడు గొప్పవాళ్లకు ఎక్కువ తెలివితేటలు ఇచ్చాడు నాకు తక్కువ తెలివి ఇచ్చాడు అని అనడం వివేకంతాదు. పరమాత్మ అందరికీ ఒకే విధమైన మెదడు, బుద్ధి, ఆలోచనా శక్తి ఇచ్చాడు. కాని దానిని మనం సకమంగా వినియోగించడం లేదు. కొంత మంది అసలు వినియోగించరు. మన ఆలోచనలన్నీ ధనం సంపాదించడం, సుఖాలు అనుభవించడం వీటి చుట్టు తిరుగుతుంటాయి. ముఖ్యంగా స్త్రీలు టివి సీరియళ్లు చూచి ఆ సీరియళ్ల గురించి ఆలోచిస్తూ ఆ కష్టాలన్నీ తాము మానసికంగా అనుభవిస్తూ మానసిక ఆందోళనకు గురి అవుతుంటారు. దానివలన మనసు ఎప్పుడూ ఆందోళనకు గురి అవుతూ ఉంటుంది. నేటి యువతరం కూడా ఎక్కువగా సినిమాలు చూస్తూ, ప్రేమ వ్యవహారాలలో, రాజకీయాలలో మునిగితేలుతూ వాటి గురించే ఆలోచిస్తూ, చదువు మీద ఏకాగతను కోలోతున్నారు. సుఖం వచ్చినపుడు ఎగిరెగిరిపడటం ఆనంద వడటం, దు:ఖం వచ్చినపుడు కుంగి పోవడం చాలామందికి ఒక అలవాటుగా మారిపోయింది. దీనికి విరుగుడు సమత్వం. సుఖదు:ఖాలను సమంగా భావిస్తే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఆలోచించే శక్తి పెరుగుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది. విద్యలో గానీ, వ్యాపారంలోగానీ, ఉద్యోగంలో కానీ, ఇంటి విషయాలలో కానీ, రాణించగలడు.
ప్రస్తుతం అర్జునుడు బాగా డిస్టర్ అయి ఉన్నాడు. అందువలన అర్జునుడి ఆలోచనా శక్తి పనిచేయడం లేదు. అర్జునుడిలో ఉన్న ఎమోషన్లు బాలెన్లు చేయగలిగితే, అతను మామూలు స్థితికి వస్తాడు. ఈ మెంటల్ ఇమలెన్స్ జీవితంలో పతి మానవుడికి ఉంటుంది. అప్పుడు మానసిక ప్రశాంతత దెబ్బతింటుంది. ఏ విషయాన్ని సకమంగా ఆలోచించలేడు. ఎప్పుడూ మనసు అల్లకల్లోలంగా ఉంటుంది. సరి అయిన నిర్ణయం తీసుకోలేడు. అప్పుడు కావాల్సింది మానసిక ప్రశాంతత. దానికి మార్గం సుఖదు:ఖములలో సమంగా ప్రవర్తించడం. ఎందుకంటే ఎల్లప్పుడూ సుఖం ఉండదు. ఎల్లప్పుడూ దుఃఖం ఉండదు. సుఖం దు:ఖం ఒకదాని వెంట వస్తూ పోతూ ఉంటాయి. ఇది అనివార్యం అని సాక్షాత్తు భగవంతుడే చెప్పాడు. కాని మనం మాత్రం మాకు ఎల్లప్పుడూ సుఖమే కలగాలని రోజూ భగవంతుడిని ప్రార్థిస్తాము. ఇంకా కొంతమంది మేము ఆ దేవుడిని కొలిస్తే అనుకున్నవి అనుకున్నట్టు జరుగుతాయి అని అంటూ ఉంటారు. ఇది అసాధ్యము అని తెలుసుకోవడమే వివేకము. అందుకే సుఖము దుఃఖము మధ్య సమత్వము సాధించాలని భగవానుడు చెప్పాడు. సుఖదుఃఖములను సమంగా చూచినప్పుడే మనసు ప్రశాంతంగా నిర్మలంగా నిశ్చలంగా ఉంటుంది.