YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

జగన్ రెండేళ్ల సీఎంనా.. కొత్త ఆక్టోపస్ జోస్యం

జగన్ రెండేళ్ల సీఎంనా.. కొత్త ఆక్టోపస్ జోస్యం

జగన్ రెండేళ్ల సీఎంనా.. కొత్త ఆక్టోపస్ జోస్యం
విశాఖపట్టణం, 
జోస్యాలు చెప్పేవారు ఉంటారు. వినేవాళ్లు ఉంటే. రాజకీయ జాతకాలు చెప్పేవారు ఉంటారు మీడియా ఎదురుగా ఉంటే. ఫోకస్ అవడానికి ఏమైనా చెబుతారు, లాజిక్ కి అందని స్టేట్ మెంట్లు ఇస్తూ ఉంటారు. ఇక ఆంధ్ర ఆక్టోపస్ గా పేరు తెచ్చుకున్న లగడపాటి రాజగోపాల్ జాతకాలు మొదట్లో హిట్ అయినా తరువాత తిరగబడ్డాయి. ఎంతలా అంటే తెలంగాణాలో కేసీఆర్ ఓడిపోతారు అంటే ఆయన బంపర్ విక్టరీ కొట్టారు. ఏపీలో జగన్ ఓడిపోవడం ఖాయమంటే సూపర్ విక్టరీతో అజేయుడిగా నిలిచారు. మరి ఈ రెండు దెబ్బలకు ఇపుడు లగడపాటి వారు ఎక్కడా కనిపించడం మానేశారు. అది వేరే కధ. ఆయన సన్నిహితుడు, రాజకీయ విశ్లేషకుడు అవతారం ఎత్తిన మాజీ ఎంపీ విశాఖ ఆక్టోపస్ సబ్బం హరి కొన్నాళ్లు సైలెంట్ గా ఉన్నా ఇపుడు మాత్రం మీడియా ముందుకు వచ్చేస్తున్నారు. జాతకాలు చెప్పేస్తున్నారు.జగన్ ఏపీకి సీఎం గా రెండేళ్లు మాత్రమే ఉంటారని సబ్బం హరి జోస్యం చెప్పేశారు. జగన్ సీఎం ఎందుకు అయ్యారా అని జనం బాధ పడుతున్నారట. రావాలి జగన్ అని ఓటేసిన వాళ్ళంత పోవాలి జగన్ అంటున్నారుట. అందువల్ల ఆయన మహా వుంటే రెండేళ్ళు మాత్రమే ముఖ్యమంత్రి అంటున్నారు సబ్బం హరి. రెండేళ్ళు ఓపిక పట్టండి, వైఎస్ జగన్ దిగిపోతారు. మన చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారని ఆయన టీడీపీ క్యాడర్ని హుషారెత్తిస్తున్నారు. బాగనే ఉంది కానీ ఎందుకు జగన్ రెండేళ్లు మాత్రమే పదవిలో ఉంటారు అన్న దానికి సబ్బం హరి లాజిక్ ఏంటి అంటే జమిలి ఎన్నికలు వస్తాయట. అపుడు ఏపీలో జగన్ సర్కార్ కూలిపోతుందట. మరి జమిలి ఎన్నికలు 2023లో అని ఈ మధ్యనే బాబు విశాఖ మీటింగులో చెప్పారు కదా. పైగా మూడేళ్ల తరువాత మాత్రమే జమిలి ఎన్నికలకు ఆలోచన చేస్తామని కేంద్రం నుంచి అప్పట్లో సంకేతాలు వచ్చాయి కదా, మధ్యలో ఈ రెండేళ్ళ ముచ్చటేంటి సబ్బం హరీ అంటే అది అడగకూడదు, చెప్పకూడదు అంతే. ఎందుకంటే జగన్ సీఎం కావడమే ఆయనకు ఇష్టంలేదాయే.జగన్ ఈ జన్మలో సీఎం కాలేడని అప్పట్లో సబ్బం హరి విశాఖ ఆక్టోపస్ హోదాలో జోస్యం చెప్పారు. మరి అది తల్లకిందులై జగన్ సీఎం అయిపోయారు. అలా ఇలా కాదు బంపర్ విక్టరీ కొట్టి అపుడే అయిదు నెలలుగా రాజ్యం కూడా చేస్తున్నారు. మరి ఆ జోస్యం ఫెయిల్ అయింది కదా అంటే మాత్రం సబ్బం హరి జవాబు చెప్పరంతే. ఆయన ఇపుడు టీడీపీలో ఉన్నారు కాబట్టి బాబు గారిని మెప్పించాలి కాబట్టి అధినేత మూడేళ్లలో ఎన్నికలు వస్తాయంటే ఈయన గారు రెండేళ్లలో వస్తాయని చెప్పాలి. అదే మరి టికెట్ రాజకీయమంటే. ఇవన్నీ సరే కానీ మళ్ళీ ఎన్నికలు వస్తే భీమిలీ టికెట్ ఈసారి కూడా మీకే వస్తుందా సబ్బం హరీ, కాస్త ఆ జాతకం చెప్పరా అంటూ సెటైర్లు వేస్తున్నారు సొంత పార్టీ వారు, బయట వైసీపీ వారు కూడా.

Related Posts