YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

ప్రమోషన్ల కోసం ఎదురు చూపులు

ప్రమోషన్ల కోసం ఎదురు చూపులు

ప్రమోషన్ల కోసం ఎదురు చూపులు
వరంగల్, 
పోలీస్‌ శాఖలో ప్రమోషన్ల కోసం కొందరు కిందిస్థాయి అధికారులు ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు. తమ బ్యాచ్‌ ఆఫీసర్లకు ప్రమోషన్‌ వచ్చి.. తమకు రాకపోవడంతో పలువురు సీఐలు, ఎస్‌ఐలు, ఏఎస్‌ఐలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్‌ రేంజ్‌తో పోలిస్తే వరంగల్‌ రేంజ్‌ ఎస్‌ఐలకు ప్రమోషన్ల విషయంలో అన్యాయం జరుగుతోందనే విమర్శలు కొన్నాళ్లుగా విన్పిస్తోంది. క్లరికల్‌ మిస్టేక్‌తో 60కి పైగా సీఐ ఖాళీలను వరంగల్‌ రేంజ్‌ నుంచి తొలగించారు. ఫలితంగా ఖాళీలు తగ్గి ఒకే బ్యాచ్‌కు చెందిన ఎస్‌ఐలు అయినప్పటికీ హైదరాబాద్‌ రేంజ్‌ ఎస్‌ఐలు ముందుగా ప్రమోషన్‌ పొందుతున్నారు. దీంతో వరంగల్‌ రేంజ్ ఎస్‌ఐలు సీనియార్టీలో వెనకబడుతున్నారు. అంతేకాకుండా డీఎస్పీ ప్రమోషన్‌ ఇచ్చేటప్పుడు 30 శాతం పోస్టులను ర్యాంకర్లతో, 70 శాతం పోస్టులను డైరెక్ట్‌ రిక్రూట్‌ ఎస్‌ఐలతో భర్తీ చేయాల్సి ఉంటుంది. ఈ రేషియోను వరంగల్‌ రేంజ్‌ మాత్రమే ఫాలో అయిందని, ఇతర రేంజ్‌ అధికారులు ఫాలో కావడం లేదనే ఆరోపణలూ ఉన్నాయి. ఈ కారణాలతోనే హైదరాబాద్‌ రేంజ్‌లోని 95, 96 బ్యాచ్‌ ఎస్‌ఐలు 2017 నవంబర్‌లోనే డీఎస్పీలుగా ప్రమోషన్‌ పొందగా, వరంగల్‌ రేంజ్‌కు చెందిన 95 బ్యాచ్‌ ఎస్‌ఐల్లో కొందరికే ప్రమోషన్‌ వచ్చింది. మరో 55 మంది ప్రమోషన్‌కు రెండేళ్లుగా ఎదురుచూస్తున్నారు. 2017–18లో ఎస్‌ఐలకు సీఐలుగా ప్రమోషన్‌ ఇచ్చేందుకు 2017 డిసెంబర్‌లో సమావేశమైన డిపార్ట్‌మెంటల్‌ ప్రమోషన్‌ కమిటీ హైదరాబాద్‌ రేంజ్‌లో 248 ఖాళీలను, వరంగల్‌ రేంజ్‌లో 162 ఖాళీలను  గుర్తించి అప్రూవల్‌ ఇచ్చింది. హైదరాబాద్‌ రేంజ్‌లో ఖాళీలను పూర్తిగా భర్తీ చేయగా, వరంగల్‌ రేంజ్‌లో 152 మందితోపాటు అప్రూవల్‌ కాని వేరే పది మంది ఎస్‌ఐలకు పోస్టింగ్స్‌ ఇచ్చారు. ఫలితంగా పది మంది ఎస్‌ఐలు నష్టపోగా, అర్హులైన మరో 8 మంది ఎస్‌ఐలు సీఐ ప్రమోషన్‌ కోసం చూస్తున్నారు. ఉన్నతాధికారులను ఎన్నిసార్లు కలిసినా పట్టించుకోకపోవడంతో వారు హైకోర్టుకు వెళ్లారు.

Related Posts