YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ

మార్కెట్లను ముంచెత్తుతున్న క్లియరెన్స్ సేల్

మార్కెట్లను ముంచెత్తుతున్న క్లియరెన్స్ సేల్

మార్కెట్లను ముంచెత్తుతున్న క్లియరెన్స్ సేల్
హైద్రాబాద్, 
 పండగలు వచ్చాయంటే డిస్కౌంట్లు ఆఫర్లు మార్కెట్లను ముంచెత్తుతున్నాయి. ఉదయం లేచింది మొదలు, టివీ ఛానెల్స్, పత్రికా ప్రకటన లు, కరపత్రాలతో వినియోగ దారులను ఆకర్షించే పనిలో ఉన్నాయి. ముఖ్యంగా వస్త్ర వ్యాపారులు, ఎలక్ట్రిక్, వాహన షో రూం నిర్వాహకులు డిస్కౌంట్ల ఆఫర్లతో పో టీ పడుతున్నారు. నగరంలో అనేక ప్రముఖ వస్త్ర వ్యాపారులు తమ వద్ద ఉన్న స్టాక్‌ను పూర్తిగా వదిలించుకునే కార్యక్రమంలో భాగంగా ఈ వీటి మీద ప్రత్యేక ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. కొందరు వ్యాపారులు తమ వద్ద ఉన్న ఒకటి కొంటే… మరొకటి ఉచితం అని ప్రకటిస్తుంటే మరి కొన్ని సంస్థలు మరో అడుగు ముందుకేసి కేజీల్లో వస్త్రాలను అమ్ముతామంటూ తమ వద్ద స్టాక్‌ను వదిలించుకునే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. ఈ విధంగా తమ వద్ద పైకి కనిపించని లోపాలు ఉన్న స్టాక్‌కు వదిలించుకుంటుంటే, మరి కొన్ని సంస్థలు తమ వద్ద బ్రాండెడ్ వస్త్రాలపై రేటును తగ్గించి అమ్మకాలు చేస్తూ లాభాలను గడిస్తున్నాయి. ఈ సంవత్సరం చివరి నాటికి తమ వద్ద ఉన్న స్టాక్‌ను పూర్తి స్థాయిలో వదిలించుకునే కార్యక్రమంలో వినియోగదారులకు డిస్కౌంట్ల ఎర వేస్తున్నాయి. అంతే కాకుండా తమ షోరూంలో వస్త్రాలను కొనుగోలు చేసిన వారికి లక్కీ కూపన్లు ఇస్తూ డ్రాలో గెలుపొందిన వారికి విలువైన బహుమతులను అందించడమే కాకుండా నగరంలోని పలు ట్రావెల్స్ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుని డ్రాలో గెలుపొందిన వారిని విదేశీ టూర్లకు కూడా పంపిస్తున్నాయి.అదే విధంగా నగరంలోని పలు ప్రముఖ ఎలక్ట్రిక్ షోరూం నిర్వాహకులు తమ వద్ద ఉన్న వస్తువులను వదిలించుకునే కార్యక్రమంలో భాగంగా టీవీ కొంటే సెల్ ఫోన్ ఫ్రీ అని…. మొబైల్ కొంటే మరో మొబైల్ ఉచితమని ప్రకటిస్తున్నాయి. అంతే కాకుండా విలువైన వస్తువుల మీద జీరో డౌన్ పేమెంట్ అని చెబుతూ ఇన్‌స్టాల్ మెంట్ పద్దతుల్లో వారి వద్ద ఉన్న స్టాక్‌ను వినియోగదారులకు అంటగట్టే కార్యక్రమాలు చేపడుతున్నాయి.పండగ సందర్భంగా నూ తన వస్త్రాలను మాత్రమే కాకుండా నూతనంగా ఏవైనా వస్తువులను కొనడం ప్రజలకు ఆనవాయితీగా రావడమే కాకుండా కొత్త వస్తువులను కొంటే మంచిదనే అభిప్రాయం ఉండటంతో వినియోగ దారులు కూడా వాటి మీద మొగ్గు చూపుతున్నారు. కొన్ని ఫైనాన్స్ కంపెనీలు కూడా వినియోగదారులకు వారి స్థాయికి తగ్గట్టుగా ఫైనాన్స్ అందిస్తుండటంతో ఆయా వస్తువుల కొనుగోళ్ళ మీద శ్రద్ధ చూపుతున్నారు. అంతే కాకుండా కొన్ని ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు ఉద్యోగులకు పండగ బోనస్‌లు ఇవ్వడంతో వారి చేతికి సమయానికి డబ్బులు అందడంతో వ్యాపారులకు బాగా కలిసి వస్తోంది. రాజస్థాన్‌కు చెందిన ఒక వజ్రాల వ్యాపారి ప్రతి దీపావళికి తమ సంస్థలో అత్యున్నత ప్రతిభను కనబర్చిన ఉద్యోగులకు పండగ కానుగా వారికి డబుల్ బెడ్ రూం ఇళ్ళను, కార్లను ఇస్తుండటం గమనార్హం. ఈ విధంగా ఆయా సంస్థలు కూడా తమ ఉద్యోగులను సంతృప్తి పరిచే చర్యలు తీసుకుంటూ ఉద్యోగులను ప్రోత్సహిస్తూ పెద్ద మొత్తంలో లాభాలను గడిస్తున్నాయి.

Related Posts