YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం తెలంగాణ

ఆసుపత్రిలో గృహిణి మృతి… బంధువుల ఆందోళన

ఆసుపత్రిలో గృహిణి మృతి… బంధువుల ఆందోళన

ఆసుపత్రిలో గృహిణి మృతి… బంధువుల ఆందోళన
రంగారెడ్డి 
రంగారెడ్డి జిల్లా   మొయినాబాద్ మండలంలోని కేతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన చింత కింది మంజుల(30) అనారోగ్యంతో బాధపడుతుండటంతో  కుటుంబీకులు బుధవారం సాయంత్రం 6గంటలకు మొయినాబాద్ లోని భాస్కర్ ఆసుపత్రికి తీసుకెళ్లారు.  అక్కడి వైద్య సిబ్బంది ఆమెకు అవసరమైన  వైద్య  చికిత్స అందించలేదు. సైగా రాత్రి  విధులు నిర్వహిస్తున్న వైద్య సిబ్బంది   బాధితురాలిని పట్టించుకోలేదని బంధువులు ఆరోపిస్తున్నారు.  వైద్యం అందక   రాత్రి 2 గంటల ప్రాంతంలో  మంజుల  చనిపోయింది.  దీనితో ఆగ్రహించిన బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్  చేసారు.  మంజులకు ఇద్దరు పిల్లలు వున్నారు.  మంజుల భర్త గతంలోనే  చనిపోయాడు. ఇప్పుడు మంజుల కూడా చనిపోవడంతో ఇద్దరు పిల్లలు అనాధలు అయ్యారు. ఈ ఘటన అక్కడ ఉన్న వారిని కలిచివేసింది..

Related Posts