YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

ఇసుక ట్రాక్టర్లు సీజ్

ఇసుక ట్రాక్టర్లు సీజ్

ఇసుక ట్రాక్టర్లు సీజ్
భద్రాద్రి 
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,అశ్వరావుపేట మండలం, గాడ్రాల గ్రామ సమీపంలోని వాగులో అనుమతులు లేకుండా అక్రమంగా తరలిస్తున్న 16 ఇసుక ట్రాక్టర్ల ను ఒక జేసీబీ ని జిల్లా జాయింట్ కలెక్టర్ కె.వెంకటేశ్వర్లు పట్టుకున్నారు.ఈ సందర్భంగా తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశం లో ఆయన మాట్లాడారు.   మన ఇసుక మన వాహనం యాప్ ద్వారా ఇసుక ర్యాంప్ లు ఏర్పాటుచేస్తున్నామని..ఈ నేపథ్యంలో  అశ్వరావుపేట మండలంలో ఇసుకకు అనుకూలమైన  రాంపులు చూడటానికి వెళ్లినప్పుడు గాడ్రాల వాగులో ఎటువంటి అనుమతులు లేకండ  తరలిస్తున్న 16 ట్రాక్టర్లు, ఒక జేసీబీ ని పట్టుకొని పోలీసులకు అప్పజెప్పామని,వాటిపై కేసులు నమోదు చేయమని చెప్పామని జె సి తెలిపారు. ఇప్పటివరకు ఇసుక రవాణా కుఎటువంటి అనుమతులు లేవని,అక్రమంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తప్పవని అన్నారు...ర్యాంప్ లు ఏర్పాటు చేసాక మన ఇసుక మన వాహనం యాప్ ద్వారా ఆన్లైన్లో నమోదు చేసుకొని  తెచ్చుకోవాలని అన్నారు...ఈ పద్ధతి వల్ల గ్రామ పంచాయతీ లకు లాభం చేకూరుతుందని వివరించారు.ఇప్పటికే కొన్ని చోట్ల ర్యాంపు లు ఏర్పాటు చేశామని,మన జిల్లాలో మరో 15 రోజుల్లో  ర్యాంపు లు ఏర్పాటు చేస్తున్నట్లు జేసీ వెంకటేశ్వర్లు తెలిపారు.

Related Posts