వేధింపులు, సాధింపులతో ప్రభుత్వం
విజయవాడ
తేదేపా ప్రభుత్వం అన్ని వర్గాలను ఆదుకున్నది. బ్రాహ్మణులకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి వారి అభివృద్ధికి కృషి చేసింది తెదేపా. వైకాపా ప్రభుత్వం నేటికి ఒక్క రూపాయి కూడా నిధులు కేటాయించలేదని మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు అన్నారు. గురువారం అయన మీడియాతో మాట్లాడారు. కాపు కార్పొరేషన్ కు 2 వేల కోట్లు కేటాయించారు కానీ ఇప్పటిదాకా నిధులు మంజూరు చేయలేదు. మిగిలిన అన్ని సామాజిక వర్గాల కార్పొరేషన్ లకు నిధులు కేటాయించలేదు. పెన్షన్ మూడు వేలు చేస్తామని చేయకుండా మాటలకే పరిమితమయ్యారని అన్నారు. బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా మహిళలకు రుణాలు,స్కాలర్షిప్ లు,స్వయం ఉపాధి రుణాలు గతం లో ఇచ్చాం. వైకాపా ప్రభుత్వం ఇప్పటివరకు నిధులు మంజూరు చేయకుండా ఆయా కార్పొరేషన్ లలో లబ్దిదారులు ఎదురు చూస్తున్నారు. వైకాపా కు పరిపాలన అనుభవం లేక పేద ప్రజలు,ఇబ్బందులు పడుతున్నారు. ఈ డబ్ల్యూ యస్ అమలు చేయడం లేదు,దాని వలన అగ్ర కుల పేదలు ఇబ్బందులు పడుతున్నారు. గతంలో చట్టబద్ధం సామాజిక వర్గాలకు కేటాయించినవి రద్దు చేశారని అన్నారు. వేధింపులు ,సాధింపులతో ఈ ప్రభుత్వం కక్షసాధింపు ధోరణితో వ్యవహరిస్తోంది. కార్పొరేషన్ లకు బడ్జెట్ లో కేటాయించిన నిధులను విడుదల చేయాలని అన్నారు. త్వరలో అన్నిసమాజికవర్గాలను ఏకం చేసి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడించారు.