13వ రోజుకు చేరుకున్న ఆర్టీసీ నిరవధిక సమ్మె.
దేవరకొండ
తమ యొక్క డిమాండ్ల కోసం ఆర్టీసీ కార్మికులు మొదలు పెట్టిన నిరవధిక సమ్మె 13వ రోజుకు చేరుకుంది.ఈరోజు దేవరకొండ లో సమ్మెలో భాగంగా ధూంధాం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, విద్యార్థి నాయకులు మరియు ఆర్టీసీ కార్మికులు పాల్గొన్నారు. అందోళనకారులు మాట్లాడుతూ .ప్రభుత్వం నిరంకుశత్వ ధోరణిలో ఉంది. ఒక ఎండీని పెట్టి పరిష్కరించలేని దౌర్భాగ్య పరిస్థితిలో దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. ఆర్టీసీని ప్రయివేటు పరం చేయడం ఎంతవరకు న్యాయని ప్రశ్నించారు. మేము కొత్త బస్సులు అడిగేది మా భార్య, పిల్లలు తిరగడానికి కాదు. ఖాళీలను భర్తీ చేయడం వలన నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు మరియు ప్రతి గ్రామానికి ప్రతి తండాకు బస్సు సౌకర్యం కల్పించవచ్చు. ప్రజలందరూ కూడా గమనించి తమకు మద్దతుగా రోడ్లపైకి వచ్చి నిరసన తెలపాలి. శుక్రవారం నుంచి తెలంగాణ బంద్ ఉంటుందని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరించారు.