YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

బురద చల్లితే ఊరుకోం

బురద చల్లితే ఊరుకోం

బురద చల్లితే ఊరుకోం
విజయవాడ
2019 అక్టోబర్16వ తేదీని ఎపి లో బ్లాక్ డే గా ప్రకటించవచ్చు. పత్రిక, మీడియా స్వేచ్చ పై క్యాబినెట్ సాక్షి గా ఆంక్షలు విధించారు. గతంలో వైయస్ పత్రికలో వార్తల పై కేసులు వేసేలా జిఒ తెచ్చారు. ఆనాడు అందరూ గట్టిగా పోరాటం చేస్తే జిఒ పక్కన పెట్టారు. దశాబ్దం తర్వాత నేడు జగన్ మళ్లీ మీడియా గొంతు నొక్కేలా వ్యవరిస్తున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమ మహేశ్వరరావు విమర్శించారు.  ఆంధ్రజ్యోతి, ఈనాడు, ఏబీఎన్, టీవీ 5 వంటి వాటి పైబురద జల్లాడు. ఇప్పుడు తండ్రి చెక్కిన జిఒ కు నగిషీలు చెక్కి.. కేసులు పెడతామని మీడియాను బెదిరిస్తున్నాడు. వివిధ శాఖల ఉన్నతాధికారులకు కేసులు పెట్టాలని క్యాబినెట్ లో తీర్మానించారు. ఇది మీడియా స్వేచ్చను హరించడమే కాదు.. వ్యతిరేకంగా వార్తలు రాయకుండా ఆంక్షలు విధిస్తున్నారని అయన అన్నారు. సాక్షి లో పని చేసినవారిని ప్రభుత్వం లో నియమించుకుని లక్షల రూపాయల జీతాలు ఇస్తున్నారు. జిఒ నెంబర్ 938తెచ్చి తప్పుడు కేసులు పెట్టాలని ప్రోత్సహిస్తున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి, రామచంద్ర మూర్తి ఇప్పుడు మాట్లాడరేమని అయన ప్రశ్నించారు. నిరాధార వార్తలు గురించి నువ్వా జగన్ మాట్లాడేది. నీ అవినీతి సాక్షిలో టిడిపి పై అసత్యాలు ప్రచారం చేసి ప్రజలను మోసం చేసింది నువ్వు. ఆర్టీసీ లో ఎలక్ట్రిక్ బస్సులు విషయంలో ఎండి సురేంద్ర బాబు తప్పుకుందివాస్త కాదా. దానిని కప్పిపుచ్చుకోవాలని ప్రభుత్వం ఇటువంటి ఆంక్షలని అన్నారు. ప్రజల సమస్యలు, ప్రభుత్వం లో జరుగుతున్న అవినీతి ని బయటపెట్టకూడదా. నిన్న జారీ చేసిన జిఒ ను ఉపసంహరించుకునేలా అందరినీ కలుపుకుని ఉద్యమిస్తాం. టిడిపి లోకి ఎంతో మంది వచ్చారు.. వెళ్లారు. పార్టీ లో పదవులు అనుభవించి, ఉన్నత స్థానాలకు చేరారు. ఇప్పుడు పార్టీ మారినంత మాత్రాన టిడిపి కి వచ్చిన నష్టం ఏమీ లేదు. మీ పార్టీ విధానాలు చెప్పుకోండి గానీ.. మాపై విమర్శలు చేయడం మానుకోండి. మా పార్టీ పైనా, చంద్రబాబు పైనా  వ్యక్తిగతంగా  బురద జల్లితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. 

Related Posts