యుద్ధ ప్రాతిపదిక పైన పనులు పూర్తి చేయాలి
ప్రచారం కోసం కాదు ఫలితాల కోసం పని చేద్దాం
అధికారులతో దేవదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి
విజయవాడ
నియోజకవర్గ పర్యటనలో భాగంగా గురువారం 32 వ డివిజన్ వాగు సెంటర్ నుంచి చిట్టినగర్ సొరంగం వరకు దేవదాయ మంత్రి శ్రీనివాస్ నగర పాలక సంస్థ కమిషనర్ మరియు అధికారులతో కలిసి పర్యటించారు. స్థానికులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆంజనేయ వాగు సెంటర్ నుంచి బ్రహ్మంగారి మఠం వరకు ఉన్న వాటర్ పైప్లైన్ లీకేజ్ వల్ల పలు ఇబ్బందులు పడుతున్న మన్నారు, ఈ ప్రాంతంలో రహదారులు గుంతలు కారణంగా వాహనదారులు పలు ఇబ్బందులు పడుతున్నామని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బ్రహ్మంగారి మఠం పక్కన ఇటీవల కురిసిన వర్షాలకు కూలిన రిటైనింగ్ వాల్ నిర్మాణం పూర్తి చేయాలని, అదే విధంగా బ్రహ్మంగారిమఠం కొండ పై భాగాన వినాయకుడి గుడి వెనకాల ఉన్న బావిని పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రహదారి వెంబడి ఉన్న సైడ్ కాలువ నిర్మాణం ఎత్తు పెంచాలని, డ్రైనేజీ మురుగునీరు పారుదలకు తగు చర్యలు చేపట్టాలన్నారు. పర్యటనలో నగరపాలక సంస్థ కమిషనర్ మరియు మాజీ కార్పొరేటర్ అప్పాజీ,వైఎస్ఆర్సీపీ 32 వ డివిజన్ అధ్యక్షులు పి. సూరిబాబు ( జగ్గు), అట్లూరి పెద్దబాబు, సూరిబాబు, దుర్గారావు, యనమదల శ్రీను, నాగ బి. పిల్ల దుర్గారావ్ , మరు పిల్ల ప్రకాష్, వర లక్ష్మి తదితరులు ఉన్నారు...