YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

వెలకట్టలేని నిర్లక్ష్యం.. 

వెలకట్టలేని నిర్లక్ష్యం.. 

వెలకట్టలేని నిర్లక్ష్యం.. 
ఆదిలాబాద్, : జిల్లాలో విషజ్వరాలను అదుపుచేయడంలో యంత్రాంగం ఘోరంగా విఫలమవుతోంది. ముఖ్యంగా జిల్లా కేంద్రంలో డెంగీ బాధితులు వేలల్లోనే ఉన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఎక్కడ చూసినా బాధితులు కనిపిస్తున్నారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉంటే హైదరాబాద్‌, మహారాష్ట్రలకు పరుగులు తీస్తున్నారు. దీంతో వైద్య ఖర్చులు తడిసిమోపెడవుతున్నాయి. మున్సిపల్ అధికారులు పారిశుద్ధ్య పనులు చేపట్టడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతోనే వ్యాధి విజృంభిస్తోంది. ఇక జ్వర బాధితులైతే లెక్కలేనంత మంది ఉన్నారు. ప్రజలు నరకయాతన పడుతున్నా పుర అధికారులు చర్యలు తీసుకోకుండా నిధులు మింగేందుకు కక్కుర్తి పడుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా వర్షాకాలం ఆరంభంలోనే మున్సిపాలిటీ అధికారులు ముందస్తు చర్యలు తీసుకుంటారు. డ్రెయినేజీలు, నీటి నిల్వ ఉన్న గుంతల్లో దోమల నివారణ కోసం గుంబూషియా చేపలను వదులుతారు. కట్టె పొడిని బాల్‌ లాగా చేసి ఆయిల్‌, కిరోసిన్‌లలో ముంచి మురికి కాలువల్లో వదులుతారు. వానలు పడ్డాక దోమల మందు స్ప్రేచేస్తోరు. కాలనీల్లో దారుల వెంబడి ఫాగింగ్‌ చేయాలి. దుర్గంధం ఉన్న చోట బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లాలి. ఆదిలాబాద్‌  పట్టణ పరిధిలో మాత్రం ఇలాంటి చర్యలేమి కనిపించలేదు. ఏటా రూ.లక్షల్లో నిధులు ఖర్చు పెడుతున్నామని చెబుతున్నప్పటికీ అధికారులే సగం నిధులు మింగేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ సంవత్సరం ఎప్పుడులేని విధంగా జ్వర బాధితులు వేలల్లో పెరిగారు. చికిత్స అందించడం, ఇటు ఆసుపత్రిలో తోడుగా ఉండడం ఇలా కుటుంబాలు ఎన్నో వ్యయ ప్రయాసాలకోరుస్తున్నారు. పుర అధికారులు చాకచక్యంగా కొన్నిచోట్ల దోమల ముందు, ఫాగింగ్‌ చేసినట్లు రుజువు కోసం కాలనీల వ్యక్తుల నుంచి సంతకాలు తీసుకుంటున్నారు. ఏమైనా అడిగితే ఇదిగో రుజువు..స్థానికుల సంతకాలున్నాయి కదా, మేం పారిశుద్ధ్య చర్యలు తీసుకున్నట్లు అని చెబుతున్నారు. అధికారులు అన్ని చర్యలు చేపడ్తే జ్వర బాధితులు ఎందుకు పెరుగుతారనేది వారికే తెలియాలి. గ్రామాల్లో చేపట్టే అవగాహన సదస్సులు ఇక్కడ నిర్వహించడం లేదు. ఒక మాటలో చెప్పాలంటే పాలక వర్గం లేక, అడిగే వారు లేకపోవడం వలన తమకెందుకులే అన్నట్లు పుర అధికారులు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
జిల్లా వ్యాప్తంగా డెంగీ కేసులు 145 నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ గుర్తించింది. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చిన వారి రక్త నమూనా పరిక్షీస్తేనే ఈ లెక్క లేలింది. ఇందులో ఆదిలాబాద్‌ పట్టణంలోనే 95 కేసులు నమోదయ్యాయి. అనధికారికంగా పట్టణంలో వెయ్యిపైనే బాధితులు ఉంటారనేది సమాచారం. ఏ ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లినా డెంగీ వ్యాధి నిర్ధరణ అయిన వారు వందల్లోనే ఉంటారని చెబుతున్నారు. స్థానికంగా చికిత్స నయం కాకుంటే చాలా మంది ఇతర ప్రాంతాలకు వెళ్తున్నారు. హైదరాబాద్‌, మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఉన్న కార్పొరేట్‌ ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు. వీరి లెక్క అధికారికంగా లేదు. అందుకనే బాధితులు పెద్ద మొత్తంలో ఉంటారని తెలుస్తోంది. ఇతర ప్రాంతాలకు వెళ్లడం వలన ఖర్చు అదనంగా పెరుగుతోంది. డెంగీతో పాటు టైఫాయిడ్‌, మలేరియా ఇతర జ్వర బాధితులు చాలా మంది చికిత్సకు ఇతర ప్రాంతాలకు హైదరాబాద్‌, నాగ్‌పూర్‌కు వెళుతున్నారు. నిరుపేదలు ఎంతో కష్టపడి దాచుకున్న డబ్బులు బయటకు తీయాల్సి వస్తోంది. మరికొందరు అప్పుచేసి చికిత్స చేయిస్తున్నారు. ఒక పక్క మానసిక వేదన ఇంకో పక్క రూ.వేలల్లో ఖర్చు మరో పక్క సమయం వృధా ఇలా అన్ని విధాల ప్రజలు తిప్పలు పడుతున్నారు.

Related Posts