పాలకీడులో పద్మావతి ప్రచారం
సూర్యాపేట
హుజూర్నగర్ నియోజకవర్గం ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా పాలకీడు మండలం జాన్ పహాడ్ కొత్త తండా చెరువు తండా గ్రామాల్లో కాంగ్రెస్ అభ్యర్ధి ఉత్తమ్ పద్మావతి రెడ్డి పర్యటించారు. హస్తం గుర్తుకే మీ అమూల్యమైన ఓటులు గెలిపించాలని అభ్యర్థించారు ఈ ప్రచారంలో పద్మావతిరెడ్డి మాట్లాడుతూ కొత్త తండా గ్రామం సాగర్ ముంపు గ్రామం నుండి పాలకవీడు మండలంలో వచ్చి చేరిందన్న ఆమె ఉత్తమ్ ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసి ప్రతి బీడు భూమిని శ్యామలంగా చేసి లిఫ్ట్ ద్వారా వాటర్ అందిస్తున్నామని తెలియజేశారు. లిఫ్టుల ద్వారా నీళ్లిచ్చి పొలాలు మేము పండించే బాధ్యత తీసుకుంటే టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి గుర్రం బోర్డు తండాలో ఎస్టీల భూములను గుంజుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు ప్రతి తండాల్లో ఎస్టీలను పెన్షన్లు తీసేస్తామని టీఆర్ఎస్ నాయకుల బెదిరిస్తోందన్నారు. మట్టపల్లి బిడ్జి యాభై కోట్లతో మేము నిర్మాణం చేస్తే కనీసం డెబ్బై మీటర్ల అనుమతులు ఇప్పించలేని ఈ ప్రభుత్వం అదే బ్రిడ్జి మీదనుంచి ఆంధ్రా వాళ్లను పిలిపించి ఎస్టీ భూములు గుంజుకుంటున్న శానంపూడి సైదిరెడ్డికి ఎలాగైనా బుద్ది చెప్పాలన్నారు మీ ఇంటి ఆడపడుచుగా ఒక మహిళను గెలిపించుకోవడంలో మీ బాధ్యత ఎంతైనా ఉందని తెలియజేశారు అన్నం పెట్టే ఈ భూములను చూచి కాంగ్రెస్ కి ఓట్లేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు