ప్రభుత్వం పై మండిపడుతున్న అఖిలపక్షనాయకులు
ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా దీక్షలు
భద్రాద్రి
భద్రాద్రి జిల్లా బూర్గంపహాడ్ మండల పరిధిలోని బూర్గంపహాడ్ ప్రధాన కూడలిలోని తహసీల్దార్ కార్యాలయం సమీపంలో టెంటు వేసి అఖిలపక్ష నాయకులు గురువారం నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు, పదమూడు రోజులకు చేరుకున్న ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతు ప్రకటించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ ఖమ్మంలో శనివారం ఆత్మహత్యకు యత్నించిన డ్రైవర్ శ్రీనివాసరెడ్డి మృతి చెందారు. అయన మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేసారు. కెసిఆర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. సిపిఐఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా నాయకుగు ముద్దా బిక్షం మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించకుండా నిరంకుశంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ప్రత్యేక తెలంగాణ సాధన సమ్మెలో ఆర్టీసీ జేఏసీ తమదైన పాత్రను పోషించి ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి శ్రమించారని వారి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని అన్నారు. భారతజనతాపార్టీ రాష్ట్ర కిషన్ మోర్చా అధికార ప్రతినిధి ఏనుగుల వెంకటరెడ్డి మాట్లాడుతూ ఆర్టీసీ న్యాయపరమైన సమస్యలను తీర్చాలని ఈనెల 19వ తేదీన రాష్ట్ర పరంగా జరగనున్న బంద్ కు అందరూ సహకరించాలని కోరారు. అన్ని సంఘాల నాయకులు ప్రభుత్వ ఉద్యోగులు సైతం పాల్గొనాలని ఆయన అన్నారు.