YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

యదేఛ్చగా తరలిపోతున్న ఇసుక

యదేఛ్చగా తరలిపోతున్న ఇసుక

యదేఛ్చగా తరలిపోతున్న ఇసుక
విజయవాడ, 
రాజధాని అమరావతిలో ఇసుక బ్లాక్‌ మార్కెట్‌కు చేరుకుంది. బ్లాక్ లో అయితే కొనుగోలుదారులు అడిగిన 5 గంటల్లోనే ఇసుక వారి ముందుంటుంది. ప్రభుత్వం చెప్పినట్లు మీ సేవలో పైసలు చెల్లించి చట్టప్రకారం వైట్ లో  ఇళ్లముందుకు ఇసుక రావాలంటే నెలల తరబడి సమయం తీసుకుం టుంది. రాజధాని అమరావతితోపాటు తాడేపల్లి, మంగళగిరి మండలాలు ఇసుక బ్లాక్‌ మార్కెట్‌కు వేదికైంది. ప్రభుత్వం ప్రకటించిన ధరకు బయట బ్లాకులో వ్యాపారులు అమ్ముతున్న ధరకు పొంతన ఉండటం లేదు. మూడు నుండి నాలుగు రెట్లు అదనంగా చెల్లించి ఇసుక కొనుగోలు చేయవలసి వస్తుందని నిర్మాణదారులు వాపోతున్నారు. ప్రభుత్వం ప్రకటించిన ధరకు ఎక్కడా ఇసుక లభ్యం కావడంలేదని వాపోతున్నారు. 10టైర్ల లారీ ఇసుక (10టన్నులు) రూ.32 వేలు ధర పలుకుతుంది. ట్రాక్టర్‌ ఇసుక ధర అయితే రూ.5వేల నుండి రూ.7వేలకు బ్లాక్‌లో విక్రయిస్తున్నారు. అదికూడా ముందుగానే అడ్వాన్స్‌ పేమెంట్‌ చెల్లిస్తేనే. చెల్లించిన 5గంటల్లోపు ఇసుక ఇంటిముందుకొచ్చేస్తుంది. ప్రభుత్వ పాలసీ ప్రకారం చలానాలు కట్టి, క్యూలైన్లో నిలబడి సమయం రెండుమూడు రోజులు వెచ్చించి రశీదు తీసుకుంటే ఇసుక ఎప్పుడొస్తుందో తెలియని పరిస్థితి నెలకొని ఉంది. రాష్ట్రంలోని అనంతపురం జిల్లా నుండి ఇసుక ఈ ప్రాంతానికి వస్తుంది. నెల్లూరు నుండి మంగళగిరిలో ఏర్పాటుచేస్తున్న డంపింగ్‌యార్డుకు వస్తున్న ఇసుక కూడా సక్రమంగా అందడంలేదనే విమర్శలు వినవస్తున్నాయి. లోడింగ్‌ అంతా మనుషులతోనే చేయించాలనే నియమము కూడా ఇక్కడ అమలు కావడంలేదు. యంత్రాలే ఇసుకలోడు చేస్తున్నాయని చెబుతున్నారు. మీ సేవలో కట్టినసొమ్ముకంటే ట్రాక్టర్‌కు అదనంగా రూ.2వేలు వసూలుచేస్తున్నారని వాపోతున్నారు. దీనికి ఎటువంటి రశీదులు కూడా ఇవ్వడంలేదని ట్రాక్టర్‌ యజమానులు అంటున్నారు. అనంతపురం జిల్లా నుండి వచ్చే ఇసుక అయితే ప్రభుత్వ లెక్కల్లోకి రాకుండానే నల్లబజారుకు తరలించి అమ్ముకుంటున్న సంగతి కళ్ళముందు కనపడుతుంది. అక్కడనుండి వచ్చే ఇసుకనుసీడ్‌ క్యాపిటల్‌గ్రామాల్లో రాత్రివేళ డంపింగ్‌చేస్తున్నారు. అక్కడనుండి తాడేపల్లి, మంగళగిరి, కృష్ణాజిల్లా దాటి ఇతర జిల్లాలకు కూడా సరఫరా కోసం గ్రామగ్రామాన ఇసుకాసురులు తమ ఏజెంట్లను ఏర్పాటుచేసుకున్నారు.

Related Posts