YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

దేవగౌడ వల్ల కావడం లేదే....

దేవగౌడ వల్ల కావడం లేదే....

దేవగౌడ వల్ల కావడం లేదే....
బెంగళూర్, 
దేవెగౌడ పార్టీని స్థాపించి ఒక స్థాయికి తీసుకెళ్లారు. జనతాదళ్ ఎస్ ను స్థాపించిన తర్వాత ఆయన ప్రధానమంత్రి కూడా కాగలిగారు. తనయుడు కుమారస్వామిని ముఖ్యమంత్రిని పలుమార్లు చేయగలిగారు. అలాంటి జేడీఎస్ కళ్ల ముందే కూలిపోతుండాన్ని దేవెగౌడ జీర్ణించుకోలేకపోతున్నారు. దేవెగౌడ కర్ణాటకలో కాంగ్రెస్ కు వ్యతిరేకంగానే జేడీఎస్ ను స్థాపించారు. కాంగ్రెస్, బీజేపీయేతర పార్టీకి స్పేస్ ఉందని భావించిన దేవెగౌడ జేడీఎస్ ను స్థాపించి దానిని నిలబెట్టగలిగారు. అయితే గత రెండేళ్లుగా పార్టీలో జరుగుతున్న పరిణామాలు చూసి ఆయన తట్టుకోలేకపోతున్నారు.రెండేళ్ల క్రితం వరకూ దళపతి దేవెగౌడ చెప్పిందే పార్టీలో వేదం. ఆయన కనుసైగలతోనే పార్టీని నడిపేవారు. కానీ రెండేళ్ల నుంచి దెవెగౌడ అనుకున్నట్లుగా జరగడం లేదు. శాసనసభ ఎన్నికల్లో కేవలం 37 స్థానాలను మాత్రమే జనతాదళ్ ఎస్ సాధించినా కుమారస్వామిని ముఖ్యమంత్రిని చేయగలిగారు దేవెగౌడ. బీజేపీ అధికారంలోకి రాకుండా ఉండేదుకు కాంగ్రెస్ దేవెగౌడ్ పార్టీతో చేతులు కలపక తప్పని పరిస్థితి. కాంగ్రెస్ రాహుల్ నాయకత్వంలో ముందుకు వెళుతుందని భావించిన దేవెగౌడ ఆ తర్వాత దానితో నేరుగా పొత్తుకు దిగారు.లోక్ సభ ఎన్నికల్లో ఘోరంగా ఓటమి పాలయ్యారు. తాను పోటీ చేసిన స్థానంలోనూ ఓటమిపాలయ్యారు. మాండ్య నియోజకవర్గంలో మనవడిని కూడా దేవెగౌడ గెలిపించుకోలేక పోయారు. మరోవైపు కుమారస్వామి సర్కార్ కుప్పకూలిపోయింది. దీంతో దేవెగౌడ నిరాశలో మునిగిపోయారు. అయితే తాజాగా కర్ణాటకలో పదిహేను నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరుగుతుండటంతో దేవెగౌడ మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకున్నారు. కాంగ్రెస్ తో కలసి పోటీ చేయకూడదని నిర్ణయించారు. క్యాడర్ లో ధైర్యం నింపేందుకు నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు.దేవెగౌడకు షాక్ లు మీద షాక్ లు తగులుతున్నాయి. ఇప్పటికే ముగ్గురు శాసనసభ్యులు పార్టీని వీడివెళ్లిపోయారు. తాజాగా మరో ఎమ్మెల్యే మహేశ్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. సా.రా మహేశ్ కె.ఆర్.నగర నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జేడీఎస్ నుంచి మరికొందరు ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఉప ఎన్నికల్లో ఎక్కువ స్థానాలను గెలుచుకోలేమన్న భావనతో తిరిగి భారతీయ జనతా పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ కు మళ్లీ తెరలేపిందని జేడీఎస్ ఆరోపిస్తోంది. కుటుంబ రాజకీయాలను తట్టుకోలేకనే మహేశ్ రాజీనామా చేసినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. మొత్తం మీద దేవెగౌడ పార్టీకి దెబ్బల మీద దెబ్బలు తగులుతున్నాయి.

Related Posts