Highlights
- గ్లోబల్ మార్కెట్ల సంకేతాలు ప్రతికూలం
- 16 పాయింట్ల నష్టంలో 33,819 వద్ద ట్రేడ్
- 4 పాయింట్ల నష్టంలో 10,406 వద్ద కదలికలు
గ్లోబల్ మార్కెట్ల నుంచి సంకేతాలు ప్రతికూలంగా వస్తుండటంతో, మార్కెట్లు ఫ్లాట్‌గా ఎంట్రీ ఇచ్చాయి. గురువారం దేశీయ స్టాక్ మార్కెట్లు స్తబ్ధుగా ప్రారంభమయ్యాయి. ప్రారంభ ట్రేడింగ్‌లో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, విప్రో, టెక్ మహింద్రా, టీసీఎస్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, వేదాంతా, అరబిందో ఫార్మా, ఎం అండ్ ఎంలు లాభాలార్జించాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్ ఇండెక్స్ కూడా 53 పాయింట్లు పైకి ఎగిసింది.55 పాయింట్ల నష్టంలో ప్రారంభమైన సెన్సెక్స్, ప్రస్తుతం 16 పాయింట్ల నష్టంలో 33,819 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ స్వల్పంగా 4 పాయింట్ల నష్టంలో 10,406 వద్ద కదులుతోంది. ఇండియా ఆయిల్, ఇన్ఫోసిస్, ఎన్‌టీపీసీ, బీపీసీఎల్ షేర్లు 0.6 శాతం నుంచి 3 శాతం కిందకి పడిపోయాయి. మరోవైపు ట్రేడ్ ఆందోళను పెరుగుతుండటంతో, ఆసియన్ మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.