YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

అభివృద్ది లేదు..ఆదాయం లేదు టెలికాన్ఫరెన్స్ లో చంద్రబాబు

అభివృద్ది లేదు..ఆదాయం లేదు టెలికాన్ఫరెన్స్ లో చంద్రబాబు

అభివృద్ది లేదు..ఆదాయం లేదు
టెలికాన్ఫరెన్స్ లో చంద్రబాబు
విజయవాడ 
రాష్ట్రాన్ని పెద్ద ఎత్తున లూటీ చేస్తూ  ప్రతిపక్ష నేతలను ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా ఇబ్బందులు పెడుతున్నారు. తామేంచేసినా రాయటానికి వీల్లేదన్నట్లు మీడియాని బెదిరిస్తున్నారు. డబ్బులు లేకపోయినా ప్రజలను మోసం చేసేందుకు ఆచరణ సాధ్యం కాని ప్రకటనలు చేస్తున్నారని మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. శుక్రవారం ఉదయం అయన పార్టీ నేతలతో  టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. చంద్రబాబు మాట్లాడుతూ ప్రభుత్వ పథకాల్లో లబ్దిదారుల సంఖ్య గణనీయంగా తగ్గించేస్తూ,  అర్హులకు ప్రయోజనం దక్కకుండా చేస్తున్నారు. అసమర్థతతో ఆర్థిక వ్యవస్థను నాశనం చేసి,  గత ప్రభుత్వ తప్పిదం అంటూ మనపై నిందలు మోపుతున్నారు. డబ్బులు లేకపోయినా ప్రజలను మోసం చేసేందుకు ఆచరణ సాధ్యం కాని ప్రకటనలు చేస్తున్నారన్నారు. ప్రభుత్వ పథకాల్లో లబ్దిదారుల సంఖ్య గణనీయంగా తగ్గించేస్తున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. తెలుగుదేశం ఐదు ఏళ్ల పాలన మొత్తం అవినీతి అని ఐదు నెలల నుంచి వెతుకుతూ ఏమీ నిరూపించలేకపోయారు. అభివృద్ధి లేదు, ఆదాయం లేదు, సంపదసృష్టిపై ఆలోచన లేదని అన్నారు. ఖర్చు మాత్రం ఇష్టానుసారం చేస్తూ పోతున్నారు. మనం అందించిన సంపదను కాపాడుకోలేకపోవటం వల్లే రాష్ట్రం అధోగతిపాలైంది. నరేగా బకాయిలు ఇంతవరకు చెల్లించకపోవటం దారుణమని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

Related Posts