ఆర్ .టి.సి కార్మికులకు మద్దతుగా ట్రాన్స్ పోర్ట్ కార్మికుల సమ్మె
హైదరాబాద్
ఆర్.టి.సి ని పరిరక్షించాలని, ప్రభుత్వంలో విలీనం చేయాలని , వేతన ఒప్పందం చేయాలని ఆర్.టి.సి కార్మికులు చేస్తున్న సమ్మెకు సంఘీభావంగా అక్టోబర్ 19 న తలపెట్టిన రాష్ట్ర బందుకు రాష్ట్రంలోని ట్రాన్స్ పోర్ట్ కార్మికులందరూ సమ్మె చేయాలని తెలంగాణ స్టేట్ మోటర్ ట్రాన్స్ పోర్టర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ (టిఎస్ఎంటి – జెఎసి) పిలుపు నిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం ఆర్.టి.సి కార్మికులతో చర్చలు జరపకుండా , యూనియన్స్ ని బ్లాక్ మెయిలర్స్ అని నిందిస్తూ, ఏకపక్షంగా 48,000 మంది కార్మికులను తొలగించినట్లు మొత్తం కార్మికవర్గంపై చేస్తున్న దాడి. ఈ దాడిని ఎదుర్కొని రాష్ట్రోల కార్మిక హక్కుల్ని ప్రజాస్వామ్యాన్ని రక్షించుకునేందుకు ఆటో, ట్రాలీ , టాక్సీ , క్యాబ్ , లారీ, డిసిఎం ట్రావెల్స్ , స్కూల్ బస్, ట్రక్క్ తదితర రవాణా రంగ కార్మికులందరూ సమ్మెలో పాల్గొని సమ్మెని జయప్రదం చేయాలని జె.ఎ.సి విజ్ఞప్తి చేసింది.హైకోర్టు సూచన ప్రకారం తక్షణం ఆర్.టి.సి కార్మికులతో చర్చలు జరిపి సమ్మె డిమాండ్సిని పరిష్కరించాలని జె.ఎ.సి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నది. సమ్మె సందర్భంగా ఇప్పటి వరకు మరణించిన ఆర్.టి.సి కార్మికుల కుటుంబాలకు రూ.25 లక్షలు ఎక్స్ గ్రేషియా ఇచ్చి వారి కుటుంబాల్ని ఆదుకోవాలని జె.ఎ.సి ప్రభుత్వాన్ని కోరింది.