సీఎస్ ను కలిసిన ఎస్పీ, ఎస్టీ కమిషన్
హైదరాబాద్,
ఎస్సి ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలోని సభ్యుల బృందం, ప్రిన్సిపాల్ సెక్రటరీ అజయ్ మిశ్రా లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషితో శుక్రవారం భేటీ అయ్యారు. సివిల్ రైట్స్ డే లో పాల్గొనాల్సిందిగా అయనను ఆహ్వానించారు. తరువాత ఎర్రోళ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ కమిషన్ చైర్మన్ గా బాధ్యతలు తీసుకున్నప్పటి నుండి తీసుకున్న చర్యలు, అట్రాసిటీ కేస్ ల పురోగతి పై సీఎస్ కు నివేదిక ఇచ్చాం. అట్రాసిటీ కేస్ లలో సత్వర న్యాయం చేస్తున్నాం అని సీఎస్ కీ తెలిపాము.సీఎస్ కూడా సంతోషం వ్యక్తం చేశారని అన్నారు. ప్రతి నెల 30 తేదీ న సివిల్ రైట్స్ డే ఎమ్మెల్యే లు,ప్రజాప్రతినిధులు, అధికారులతో నిర్వహిస్తున్నాం. గతంలో సివిల్ రైట్స్ డే ఎప్పుడో ఒక్కసారి జరిగేది. ఈ సివిల్ రైట్స్ డే లో సీఎస్ ను కూడా పాల్గొనాలి అని కోరాం. సీఎస్ పాల్గొంటే సివిల్ రైట్స్ డే లో కింది స్థాయి అధికారులు కూడా పాల్గొంటారని అయన అన్నారు. మేము ఆడిగిన వెంటనే సీఎస్ సీవీల్ రైట్స్ డే లో పాల్గొనేందుకు అంగీకారాన్ని తెలిపారు. వచ్చే నెల 30 తేదీన సివిల్ రైట్స్ డే పాల్గొంటారు ఆయనతో పాటు డీజీపీ, ప్రిన్సిపాల్ సెక్రటరీ లు కూడా పాల్గొంటారని అయన అన్నారు.