పరిస్థితులు దారుణంగా వున్నాయి
హైదరాబాద్
ప్రభుత్వానికి అన్ని వర్గాలు ప్రజలు, ప్రజా సంఘాలు కుల సంఘాలు ఎదురుతిరిగాయి. నిన్నటి నుండి ఉబెర్, ఓలా కార్మికులు ఉద్యోగులు అన్ని క్యాబ్ డ్రైవర్లు కూడా నిరవధిక సమ్మెకు మద్దతు పలుకుతున్నారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. శుక్రవారం అయన మీడియాతో మాట్లాడారు. ఆర్టీసీ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిన పడుతుంది.. రాష్ట్రంలో కార్యకలాపాలు స్తంభించాయి. అసలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా అని అనుమానంగా ఉంది. రాష్ట్రంలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని రవాణా శాఖ మంత్రి స్పందించకపోవడం బాధాకరమని అన్నారు. పాలన అటకెక్కించి కేవలం తన ప్రతిష్ట కోసం ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. మళ్లీ నీ తెలంగాణ ఉద్యమాన్ని తలపించే విధంగా భారీ ఉద్యమాన్ని బీజేపీ నాంది పలుకుతుందని అయన అన్నారు.