సిట్ ఏర్పాటును స్వాగతిస్తున్నాం
నిష్పక్షపాత విచారణ నివేదికను ప్రజల ముందు బహిర్గతం చేయాలి
విశాఖపట్నం,
విశాఖపట్నం, చుట్టుపక్కల మండలాల్లో ఆరోపణలున్న భూ అక్రమాలు పై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) తాజా పునర్నియామకాన్ని స్వాగతిస్తున్నాం. మూడు నెలల లోపు విచారణ పూర్తి చేసేలా మాజీ ఐఎఎస్ అధికారి విజయకుమార్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన సిట్ నిష్పక్షపాత విచారణ చేస్తుందన్న సంపూర్ణ విశ్వాసం ఉంది. విచారణ నివేదికను ప్రజల ముందు బహిర్గతం చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నానని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. ఈ మేరకు శుక్రవారం అయన ఒక ప్రకటన విడుదల చేసారు. వాస్తవానికి సిట్ ఏర్పాటు కు గత ప్రభుత్వంలో సీనియర్ కేబినేట్ మినిస్టర్ హోదాలో నేను స్వయంగా దర్యాప్తు కోరుతూ చొరవ తీసుకుని అప్పటి ముఖ్యమంత్రికి లేఖ రాసిన విషయం మరొక్కసారి గుర్తుచేస్తున్నాను. కారణాలు ఏమైనప్పటికీ ఆ నివేదిక బహిర్గతం కాలేదు. నేను కేబినెట్ మంత్రి హోదాలో కూడా ఆ నివేదికను బహిర్గతం చేయాలని డిమాండ్ చేసిన విషయం కూడా రాజకీయ, అధికార వర్గాలందరికీ తెలిసిందే. వైస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత కూడా ఈ ఏడాది ఆగస్ట్ 29 న మళ్లీ సిట్ ని పునర్నియమించి నిష్పక్షపాత విచారణా నివేదికను బహిర్గతం చేసి ప్రజలకు వివరించాలని విశాఖపట్టణం ఉత్తర నియోజకవర్గ శాసనసభ్యులుగా కోరిన విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నానని అన్నారు.
రాష్ట్ర ఆర్థికరాజధానిగా కొనసాగుతోన్న అద్భుత నగరం విశాఖ లో ఇలాంటి వాటికి అవకాశం ఉండకూడదని, ప్రశాంత, పరిశుద్ధ నగరంగా విశాఖ కు ఉన్న పేరు ను రాజకీయాలతో కలుషితం చేయకుండా చూస్తారన్న అచంచల విశ్వాసం నాకుంది. అలాంటి ప్రయత్నాలకు ఎప్పుడు ఎలాంటి సహకారం కావాల్సి వచ్చినా మేము ముందుంటామని తెలియచేస్తున్నామని అన్నారు.