YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఉగాదినాటికి పేదల ఇళ్లు

ఉగాదినాటికి పేదల ఇళ్లు

ఉగాదినాటికి పేదల ఇళ్లు
ఏలూరు, 
పేదలకు బహుళ అంతస్తు భవనాలు నిర్మించి ఇస్తామని గత చంద్రబాబు పాలనలో స్థానిక తెలుగుదేశం నాయకులు మాయమాటలు చెప్పి తమవద్ద లక్షలాది రూపాయలు తీసుకున్నారని, ఇళ్లు ఎక్కడున్నాయని ప్రశ్నిస్తే తమపై రౌడీలు, గూండాలతో దౌర్జన్యం చేయిస్తున్నారని పలువురు పేదలు ఉపముఖ్యమంత్రి    ఆళ్ల నాని వద్ద కన్నీరు పెట్టుకున్నారు. స్థానిక మంత్రి కేంపు కార్యాలయంలో ఏలూరు దక్షిణపువీధి, కత్తేపు వీధి తదితర ప్రాంతాలకు చెందిన పేదలు  నానిని కలిసి తమకు జరిగిన అన్యాయాన్ని చెప్పి కంటకన్నీరుపెట్టారు. 5 నుండి 10 రూపాయల వడ్దీలకు డబ్బు తీసుకువచ్చి అప్పటితెలుగుదేశం ప్రజాప్రతినిధి ఆదేశాల మేరకు తెలుగుదేశం నాయకులకు డబ్బులు క ట్టామని,  రెండేళ్లయినా బహుళ అంతస్తు భవనాలు తమకు కేటయించలేదని వారు వాపోయారు . చేసిన అప్పునకు వడ్దీ కట్టలేక అద్దెలు చెల్లించలేక మనోవేదనకు గురై తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరామని మహిళలు చెప్పారు. ఏలూరు కతైపువీధికి చెందిన  మడుపల్లి ఉమాదేవి మాట్లాడుతూ తమవద్ద 70 వేల రూపాయలు కట్టించుకుని బహుళ అంతస్తు భవనంలో ఒక ఇల్లు కేటాయిస్తామని చెప్పారని, రెండేళ్లు దాటినా అతిగతీలేదని, తమ సొమ్ము తిరిగి ఇవ్వాలని కోరితే గుండాలు, రౌడీలతో తమపై దౌర్జన్యం చేయిస్తున్నారని   కంఠ కన్నీరుపెట్టుకోగా, శుక్రవారం పూట మహిళ కంఠకన్నీరు పెట్టకూడదని ఇటువంటి బాధితులకు అండగా వుంటానని, ఇటీవల కాలంలో చాలామంది మహిళలు ఇలా డబ్బుకట్టి మోసపోయామని తన దృష్టికి తీసుకువచ్చారని ఎవరైతే డబ్బులు కట్టారో వారిపై సంబంధిత పోలీస్ స్టేషన్ లో పి ర్యాదు చేయాలని, ఆప్రభుత్వంలో ఇళ్లు రాక బాధపడవద్దని అర్హులైన పేదలందరికీ ఉగాధినాటికి ఇళ్లస్థలపట్టాలు ఇచ్చి ఇళ్ల నిర్మాణానికి తగు చర్యలు తీసుకుంటానని  నాని చెప్పారు. దక్షిణపు వీధికి చెందిన నూకల రామబ్రహ్మం, సూర్య నాగ మల్లేశ్వరరావు, తాము కూడా చెరో లక్షరూపాయలు కట్టామని, రెండు సంవత్సరాలు దాటినా తమకు ఇళ్లు కేటాయించలేదని, దీనివల్ల ఆర్థికంగా ఎంతో నష్టపోయామని  నాని దృష్టికి తీసుకురాగా, పోలీసు స్టేషన్ లో పిర్యాదు చేయాలని  నాని సూచించారు. ఉగాధి నాటికి ఏలూరు నియోజకవర్గంలొనే 15 వేల మంది పేదలకు ఇళ్లస్థలపట్టాలు అందించి చరిత్ర సృష్టించనున్నామని, మోపపోయిన బాధితులకు కూడా స్వంతఇంటికలను సాకారం చేస్తామని ఈవిషయంలో ఎవరికీ ఒక్కపైగా చెల్లించనవసరంలేదని  నాని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ఒ కాంగ్రెస్ పార్టీ నాయకులు డా. దిరిసాల వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts