YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

కేసీఆర్ కళ్ళు తెరిపించాల్సిన సమయం ఆసన్నమైంది ఏఐసీసీ సెక్రటరీ మధుయాష్కీ

కేసీఆర్ కళ్ళు తెరిపించాల్సిన సమయం ఆసన్నమైంది ఏఐసీసీ సెక్రటరీ మధుయాష్కీ

కేసీఆర్ కళ్ళు తెరిపించాల్సిన సమయం ఆసన్నమైంది ఏఐసీసీ సెక్రటరీ మధుయాష్కీ
హైదరాబాద్ 
రెండు వారాలుగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తుంటె ప్రభుత్వం మిన్నకుండడాన్ని ఏఐసీసీ సెక్రటరీ మధుయాష్కీ తప్పు బట్టారు.శుక్రవారం గాంధీ భవన్ లో మేడియా సమావేశం లో మాట్లాడుతూ అమలు కు సాధ్యం కానీ అబద్ధపు హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసారని,కేసీఆర్ కళ్ళు తెరిపించాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ర్టం ఏర్పడిన నాటి నుంచి రాష్ట్ర ఆకాంక్ష ను ఆసరాగా చేసుకోని కేసీఆర్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు.తెలంగాణ.తెలంగాణ ఉద్యమ  సకలజనుల సమ్మె లో ఆర్టీసీ కార్మికులది అత్యంత కీలకపాత్ర అన్నారు.ఆర్టీసీ కార్మికుల పిల్లల శోకాలు కేసీఆర్ కు తగులుతాయని,కార్మికుల కు కాంగ్రెస్ అండగా ఉంటుందని తెలిపారు.దసరా కు కార్మిక కుటుంబాలు పస్తులు ఉండేలా చేసిన కేసీఆర్ కే దక్కిందన్నారు.గవర్నర్ చొరవ తీసుకొని సమస్య పరిష్కరించాలని కోరారు.కార్మికుల ఉద్యోగాలు పోవు..రాజ్యంగం అండగా ఉంటుందన్నారు.ఆర్టీసీ అప్పులు అనేది ఉత్తమాటని,మెఘా కంపెనీకి ఆర్టీసీ ఆస్తులు కట్టబెట్టడం  ఓ కుట్ర..అన్నారు.ప్రభుత్వం లో ఓ మంత్రి మెఘా వెనుక ఉండి నడిపిస్తున్నారు..ఉద్యమం తో పదవులు పొందిన వారు ..ఇప్పుడు కార్మికుల సమస్య పై స్పందించడం లేదన్నారు.ఆలస్యమైనా ఉద్యోగ సంఘాలు స్పందించి మద్దతు తెలుపడం సంతోష మన్నారు.ఆర్టీసీ కార్మికుల సమ్మె కోసం తెలంగాణ తెచ్చుకోలేదన్నారు.తెలంగాణ కోసం ఎలాగైతె ఉద్యమం చేసామో..తెలంగాణ ఆకాంక్ష అమలు కోసం ఉద్యమం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఆంధ్ర ,తెలంగాణ సీఎం దొంగలు దొంగలు దోచుకున్నట్లుగా ఉంది. దోపిడీ కోసమే ఇరు రాష్ర్టాల సీఎం లు ఎకం అవుతున్నారన్నారు.కల్వకుంట్ల కుటుంబం అవినీతి లో కూరుకుపోయి వేల కోట్లు సంపాదించారన్నారు.హైకోర్టు తీర్పు కార్మికుల పక్షాన వస్తుందని ఆశిస్తున్నామన్నారు.రేపటి బంద్ కు అన్ని పక్షాలు మద్దతు తెలిపి ,బంద్ ని విజయవంతం చేయాలని కోరారు. ఓటమి భయంతోనే కేటీఆర్ రోడ్ షో లు ,కేసీఆర్ సభ రద్దు చేసుకున్నారు.హుజూర్ నగర్  లో పోటీ లేదు..మేమే గెలుస్తా మన్నారు.

Related Posts