YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

సుప్రీంకోర్టు నూతన సీజేఐ గా జస్టిస్‌ శరద్‌ అరవింద్‌ బోబ్డే!

సుప్రీంకోర్టు నూతన సీజేఐ గా జస్టిస్‌ శరద్‌ అరవింద్‌ బోబ్డే!

సుప్రీంకోర్టు నూతన సీజేఐ గా జస్టిస్‌ శరద్‌ అరవింద్‌ బోబ్డే!
న్యూఢిల్లీ 
 ప్రస్తుత సీజేఐ జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ నవంబరు 17న పదవీ విరమణ చేయనున్న నేపద్యం లో సుప్రీంకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)గా జస్టిస్‌ శరద్‌ అరవింద్‌ బోబ్డే బాధ్యతలు చేపట్టనున్నారు.  ఈ మేరకు తన స్థానంలో నూతన సీజేఐగా జస్టిస్‌ శరద్‌ అరవింద్‌ బోబ్డే పేరును ప్రతిపాదిస్తూ కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖకు ఆయన లేఖ రాశారు. దీంతో నవంబరు 18న జస్టిస్‌ శరద్‌ అరవింద్‌ బోబ్డే ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టనున్నారు. కాగా కొలీజియం సిఫార్సుల మేరకు సుప్రీంకోర్టు జడ్జీల నియామకం జరుగుతుందన్న విషయం తెలిసిందే. సీనియారిటీ ప్రకారం జడ్జీల నియామకం జరిపే సంప్రదాయం కొనసాగుతోంది. ఇక ప్రస్తుతం ఉన్న అత్యున్నత న్యాయస్థానం జడ్జీల్లో రంజన్‌ గొగోయ్‌ తర్వాత శరద్‌ అరవింద్‌ సీనియర్‌గా ఉన్నారు. ఈ నేపథ్యంలో  సుప్రీంకోర్టు 47వ ప్రధాన న్యాయమూర్తిగా ఆయన నియామకం లాంఛనప్రాయమే కానుంది. అరవింద్‌ బోబ్డే నియామకానికి సంబంధించిన పత్రాలు కూడా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. 

Related Posts