YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం జ్ఞానమార్గం ఆంధ్ర ప్రదేశ్

ఆ ఆలయాలను తిరిగి నిర్మిస్తాం

ఆ ఆలయాలను తిరిగి నిర్మిస్తాం

ఆ ఆలయాలను తిరిగి నిర్మిస్తాం
విజయవాడ, 
దేవాదాయ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించాం. దేవాలయ శాఖకు చెందిన భూములను అన్యాక్రాంతం కాకుండా పరిరక్షించే విషయంపై చర్చించాం. దూపదీప నైవేద్యం అమలు విషయంపై కూడా చర్చించాం. అర్హత ఉన్న ప్రతి గుడిలో దూపదీప నైవేద్యాలు అమలు చేస్తామని దేవాదాయ శాఖ మంత్రి  వెల్లంపల్లి  శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం అయన మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్  బడ్జెట్ లో 234 కోట్ల నిధులు కేటాయించారు. ధూపదీప నైవేద్యానికి 5 నుంచి 10వేలు ఇచ్చే విధంగా ఆదేశాలు ఇచ్చాం. ఖాళీ స్థలాలు సంరక్షించేందుకు మునిసిపాలిటీ, పంచాయతీ అధికారులకు వివరాలు ఇచ్చి వాటిని ఎవరికి ఇవ్వకుండా ఆదేశాలు ఇస్తాం. దేవాదాయ శాఖ తరపున ఒక ఐ పి యస్ అధికారిని నియమించుకోవాలని నిర్ణయించాం. దేవాదాయ శాఖలో అనేక పోస్టు లు ఖాళీగా ఉన్నాయని అన్నారు. వాటిని భర్తీ చేయాలని సీఎం జగన్ ని కోరనున్నాం. అర్చకులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని నిర్ణయించాం. అర్చకుల భవిష్యత్ కోసం ఈ నిర్ణయం తీసుకుంటున్నాం. దేవాలయాల అభివృద్ధి కి నిధులు కేటాయించనున్నాం. నవంబర్ ఒకటి నుంచి డిసెంబర్ ఆఖరు కారకు వారానికి ఒకసారి తమ శాఖ అధికారులు ఒక్కో జిల్లాలో పర్యటించనున్నారని మంత్రి తెలిపారు.  భక్తులకు సేవ అందించాలనేదే తమ లక్ష్యం. గత ప్రభుత్వం నిబంధనలకు వ్యతిరేకంగాజారీ చేసిన జీవోలను రద్దు చేస్తాం. చంద్రబాబు హయాంలో బినామీలకు భూములు అప్పనంగా ఇచ్చారు. చంద్రబాబు కు దేవుడంటే భయం లేదు. దేవుని భూములంటే  కూడా విలువ లేదు. గత ప్రభుత్వం పుస్కరాల సమయంలో కూల్చిన దేవాలయం ను తిరిగి నిర్మిస్తామని అయన అన్నారు.

Related Posts