ఎస్వీ ఛానల్ పై కుట్ర
తిరుపతి
ఎస్వీ భక్తి చానల్ ప్రతిష్టను దెబ్బ తీయటానికి కుట్ర జరుగుతోందని ఆ చానల్ చైర్మన్ పృధ్విరాజ్ అరోపించారు. తిరుమలలో స్వామివారి చక్రస్నానం రోజు చిత్రీకరించిన ఒక వీడియోను ఎడిటింగ్ చేయకముందే లీక్ చేశారు. ఎడిటింగ్ కానీ వీడియోను సోషల్ మీడియాలో పెట్టారని అయన అన్నారు. ఇది పథకం ప్రకారం జరిగింది. సిబ్బందే ఇలా చేశారని అయన ఆరోపించారు. శుక్రవారం అయన మీడియాతో మాట్లాడారు. వీడియో టేప్ లీక్ మీద టిటిడి చైర్మన్ కు పిర్యాదు చేస్తున్నా. గత ప్రభుత్వంలో భక్తి చానల్ నిధులు భారీగా దుర్వినియోగం అయ్యాయి. వాటి మీద కూడా విచారణ జరిపిస్తున్నామని అన్నారు. కమెడియన్ భక్తి చానల్ చైర్మన్ అంటూ నామీద కొద్దరు తప్పుడు పోస్టింగులు పెడుతున్నారు. ఒక దర్శకుడు చైర్మన్ కాగా లేని తప్పు ఒక నటుడు చైర్మన్ అయితే తప్పు ఎలా అవుతుంది. సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఎస్వీ భక్తి ఛానల్లో పొదుపు చర్యలు చేపట్టాం. పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలకు భక్తి చానల్ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసిందని అన్నారు.