ఇల్లు లేని వారు గ్రామసభల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు
తహసిల్దార్ శివ శంకర్ నాయక్
బురుజుల,యడవలి గ్రామాలలో గ్రామసభలను నిర్వహించిన రెవెన్యూ అధికారులు.
మద్దికెర
అర్హులై ఉండి ఇల్లులేని వారు గ్రామసభల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తాహసిల్దార్ శివ శంకర్ నాయక్ తెలియజేశారు.మద్దికెర మండల పరిధిలోని అర్హులైన ప్రతిఒక్కరికీ ఇళ్ల స్థలాల కేటాయింపు జరుగుతుందని రెవెన్యూ అధికారులు గ్రామ సభలో తెలియజేశారు. నవరత్నాలు పేదలందరికీ ఇల్లు గ్రామసభల కార్యక్రమంలో భాగంగా ఇంటి స్థలాల కొరకై అర్హులైన వారిని గుర్తించేందుకు గ్రామ సభలను ఏర్పాటు చేసినట్టు తహసిల్దార్ శివ శంకర్ నాయక్ తెలిపారు.ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ శుక్రవారం మండల పరిధిలోని బురుజుల,యడవలి గ్రామాలలో గ్రామ సభలను నిర్వహించారు.బురుజుల గ్రామంలో ఇంటి స్థలం కొరకు 87 మంది ఇంటి స్థలం కొరకు అర్హులైనట్లు ఆయన తెలిపారు.అర్హులైన జాబితాను పూర్తిస్థాయిలో పరిశీలించాలని అధికారులు తెలియజేశారు. సాధికార సర్వే మరియు ఆర్.టి.జి.ఎస్ ద్వారా అర్హుల జాబితాను ప్రభుత్వం విడుదల చేసిందని ఆయన ప్రజలకు తెలియజేశారు. అర్హులై ఉండి జాబితాలో లేని వారు తిరిగి దరఖాస్తు చేసుకోవాలని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ రవి,వీఆర్వో శివయ్య, సచివాలయం ఉద్యోగులు, వాలంటీర్లు, వీఆర్ఏలు,వైయస్సార్ సిపి నాయకులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.