ప్లాస్టిక్ నిర్మూలన మనందరి బాధ్యత - జిల్లా కలెక్టర్ శ్రీ దేవసేన
పెద్దపల్లి అ
జిల్లాలో ప్లాస్టిక్ ను నివారించడం మనందరి బాధ్యత అని జిల్లా కలెక్టర్ శ్రీ దేవసేన అన్నారు. స్వచ్చ శుక్రవారం కార్యక్రమంలో భాగంగా రంగంపల్లి నుండి శాంతి నగర్ వరకు రాజీవ్ రహదారి పై ప్రజలను, అధికారులను భాగస్వామ్యం చేస్తూ పెద్దపల్లి శాసనసభ్యులు దాసరి మనోహర్ రెడ్డి తో కలిసి ప్లాస్టిక్ చెత్త ఎరివేత కార్యక్రమం నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్ శ్రీ దేవసేన మాట్లాడుతూ ఒక రోజు ప్లాస్టిక్ ఏరి వేత కార్యక్రమం నిర్వహిస్తే సుమారు 10 క్వింటాళ్ల పైగా ప్లాస్టిక్ చెత్త ను రోడ్లపై నుంచి సేకరించామని, ప్లాస్టిక్ వినియోగం వల్ల పర్యావరణానికి, మన ఆరోగ్యానికి చాలా నష్టం వాటిల్లిందని, క్యాన్సర్, ఆస్తమా వంటి తీవ్రమైన వ్యాధులు ప్లాస్టిక్ అధికంగా వినియోగించడం వల్ల వస్తాయని, దీనిని నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సింగిల్ యూసెజ్ ప్లాస్టిక్ ను నిషేధించింది అని కలెక్టర్ తెలిపారు. ఇటీవల కాలంలో గ్రామీణ ప్రాంతాలలో పారిశుద్ధ్య పెంపుదల కోసం నిర్వహించిన 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ కు అనుగుణంగా పట్టణ ప్రాంతాలలో సైతం ఒక కార్యక్రమాన్ని రూపొందించి అమలు చేయాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఇటీవల ఆదేశించారని కలెక్టర్ తెలిపారు. స్వచ్ఛతా హి సేవా కార్యక్రమంలో భాగంగా ఈరోజు జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలలో అధికారులు ,ప్రజాప్రతినిధులు ప్లాస్టిక్ ఏరివేత కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో ప్లాస్టిక్ వినియోగం నిషేధించడానికి ప్రజలు పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ప్రజలకు స్ఫూర్తి కలిగించే విధంగా ఉన్నతాధికారులు,ప్రజాప్రతినిధులు సైతం ప్లాస్టిక్ చెత్తను ఎరివేసే కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని , మనం చెత్తను వేరు చేయడం ద్వారా ప్లాస్టిక్ చెత్త వల్ల కలిగే నష్టాలను నివారించ గలుగుతామని, జిల్లాలోని ప్రతి ఇంట్లో ప్రతి పౌరుడు తడి చెత్త ,పొడి చెత్త ,ప్లాస్టిక్ చెత్తను వేరు వేరుగా సేకరించి సంబంధిత పారిశుద్ధ్య సిబ్బందికి అప్పగించాలని, చెత్తను వేరు చేయడం ద్వారా వాటిని సమర్ధవంతంగా వినియోగించుకోని ఆదాయం సైతం సృష్టించగలుగుతామని, దీనికి ప్రజల అందరి సహకారం చాలా అవసరం అని కలెక్టర్ తెలిపారు. జిల్లా ప్రజలందరూ యంత్రాంగానికి పారిశుద్ధ్య సిబ్బందికి సంబంధిత అధికారులకు సహకరించాలని,ప్లాస్టిక్ నిర్మూలనలో వారి వంతు పాత్ర పోషించాలని కలెక్టర్ కోరారు. ఈరోజు నిర్వహించిన ప్లాస్టిక్ ఏరివేత కార్యక్రమం లో చిన్న పిల్లలు చాలా ఉత్సాహంగా పాల్గొన్నారని, అధికారులకు, సిబ్బందికి చిన్నారులు ఎంతో స్ఫూర్తిని నింపారని, చిన్నపిల్లలు పాల్గొన్న కార్యక్రమంలో మనందరం సైతం పాల్గొని విజయవంతం చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ నిషేధించడంలో జిల్లా లోని పాత్రికేయులు సైతం సహకరించాలని, ప్లాస్టిక్ వల్ల కలిగే నష్టాలను ప్రజలకు వివరించాలని, ప్లాస్టిక్ ఏరివేత కార్యక్రమం లో పాత్రికేయులు కూడా స్వచ్ఛందంగా పాల్గొనడం పట్ల కలెక్టర్ సంతోషం వ్యక్తం చేశారు.
ప్రజా భాగస్వామ్యంతోనే ప్లాస్టిక్ రహిత పెద్దపల్లి సాధ్యం.
ప్రజల భాగస్వామ్యంతోనే ప్లాస్టిక్ రహిత పెద్దపల్లి సాధ్యమవుతుందని పెద్దపల్లి శాసన సభ్యులు దాసరి మనోహర్ రెడ్డి అన్నారు. పెద్దపల్లి నియోజకవర్గ పరిధిలో ప్రతి ఇంట్లో ప్లాస్టిక్ చెత్త ను ప్రత్యేకంగా సేకరించాలని,ఆరోగ్యం పట్ల, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం పట్ల ప్రజలు సైతం బాధ్యతగా వ్యవహరించాలని, జిల్లా అధికారులు అందించే సూచనలు తప్పకుండా పాటించాలని, ప్లాస్టిక్ వినియోగం పూర్తిస్థాయిలో నిషేదించాలని, వాటి స్థానంలో బట్ట సంచులను వినియోగించుకోవాలని ఎమ్మెల్యే తెలిపారు. అధికారులు ,ప్రజా ప్రతినిధులు ఒక రోజు శుభ్రం చేస్తారని, మన పరిసరాలను మనమే నిరంతరం పరిశుభ్రంగా ఉండేవిధంగా జీవనశైలిలో మార్పు తీసుకొని రావాలని, ఏ ఇంట్లో చెత్త ఆ ఇంట్లోనే వేరువేరుగా చేయాలని, అప్పుడే స్వచ్ఛత నుండి స్వస్థత వరకు అనే ప్రభుత్వ సంకల్పం సాధ్యమవుతుందని, దీనికి ప్రజలు సహకరించాలని ఎమ్మెల్యే కోరారు.
పెద్దపల్లి రెవెన్యూ డివిజన్ అధికారి ఉపేందర్ రెడ్డి, ముఖ్య ప్రణాళికాధికారి ఇస్మాయిల్ , జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి రాజ వీరు, జిల్లా గ్రామీణ నీటి సరఫరా అధికారి , జిల్లా పౌరసంబంధాల అధికారి శ్రీధర్, పాత్రికేయులు,విద్యార్థులు సంబంధిత అధికారులు ప్రజలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.