నర్సాపురం లాయర్ల నిరసన
ఏలూరు
హైకోర్టును అమరావతి నుండి కర్నూలు కు తరలించాలనే ప్రభుత్వ ఆలోచనను వ్యతిరేకిస్తూ.. నర్సాపురం బార్ అసోసియేషన్వారి ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టును అమరావతిలోనే కొనసాగించాలని కోరుతూ.. న్యాయవాదులంతా శుక్రవారం విధులు బహిష్కరించి నిరసన కార్యక్రమాన్ని ప్రారంభించారు. గత నెల రోజులుగా న్యాయవాదులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో.. దీనిపై ప్రభుత్యం స్పష్టమైన వివరణ ఇవ్వకుండా కాలయాపన చేయడాన్ని నిరసిస్తూ.. న్యాయవాదులు నరసాపురం కోర్ట్ ఎదురుగ నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమానికి బాడ్ అసోసియేషన్ అధ్యక్షులు దేవ రంజిత్ కుమార్, ప్రధానకార్యదర్శి గన్నాబత్తుల శివాజీ చక్రవర్తి, ఉపాధ్యక్షులు పూరేళ్ల శ్రీనివాస్, కార్యదర్శి కొత్తపల్లి రమేష్, కోశాధికారి, ఆర్జి.రాములు, బళ్లారి శ్రీహరి, కమిటీ సభ్యులు బి.ప్రగతి, కె.భవానీ, కానూరు స్వామినాయుడు, పోలిశెట్టి రఘురాం, చల్ల దానయ్య నాయుడు, పోలిశెట్టి సూరిబాబు, తదితరులు పాల్గోన్నారు.