నిర్మల్ లో పోలీసులు రక్తదానం
నిర్మల్,
పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను పురస్కరించుకోని శుక్రవారం నిర్మల్ జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా పోలీస్ ఆధ్వరంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది... నిర్మల్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి రక్త నిధి సహకారంతో ఏర్పాటు చేసిన ఈ శిబిరాన్ని జిల్లా ఎస్పీ .సి.శశిధర్ రాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ దేశ భద్రత కోసం దేశం వ్యాప్తంగా పోలీసులు ప్రాణత్యాగాలు చేస్తున్నారని, పోలీసులు అందిస్తున్న సేవలకు ప్రజల నుండి గుర్తింపు వున్న లేకున్నా పోలీసులు మాత్రం ప్రజల రక్షణ కోసం తమ విధులను కోనసాగిస్తారని, పోలీసులు శాంతి భద్రత పరిరక్షణ కోసం తమ ప్రాణత్యాగాలకైనా సిద్దంగా వుంటారని, పోలీసు అమరవీరుల త్యాగాలకు వెలకట్టలేనిదని, ప్రతినిత్యం ప్రజా సేవలో విధులు నిర్వర్తిస్తూ ప్రాణత్యాగాలు చేసిన పోలీసు అమరవీరుల స్మరించుకోవాల్సిన అవసరం ప్రజలకు వుందని, మనం రక్త దానం చేయడం వల్ల ప్రమాదంలో గాయపడిన వారిని రక్షించ వచ్చను అని తెలిపారు. ఈ సందర్బంగా రక్తదాతలకు పండ్లు అందజేశారు.