41 షాపులకు గానూ 648 దరఖాస్తులు
కలెక్టర్ పర్యవేక్షణలో షాపుల కేటాయింపు
మానాల షాపుకు డ్రా వాయిదా
లక్కి డ్రా ద్వారా ఎక్సైజ్ శాఖకు రూ 12 కోట్ల 96 లక్షల ఆదాయం
సిరిసిల్ల,
జిల్లాలో మద్యం షాప్ లకు నిర్వహించిన లక్కిడ్రా శుక్రవారం ప్రశాంతంగా ముగిసింది. జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ నేతృత్వంలో డ్రా జరిగింది. జిల్లాలో మొత్తం 41 షాపులకు గాను 648 నుండి దరఖాస్తులు వచ్చాయి. ఒక్క డ్రా కు 2 లక్షల చొప్పున మొత్తం 12 కోట్ల 96 లక్షల ఆదాయం ఎక్సైజ్ శాఖకు సమకురింది. శుక్రవారం నిర్వహించిన డ్రాలో 40 షాప్ లకు లక్కి డ్రా నిర్వహించి షాపులను అధికారులు కేటాయించారు. షాప్ వారిగా డ్రా వేసేందుకు కనీసం ఐదు దరఖాస్తులు రావల్సి ఉండగా మానాల షాప్ కు కేవలం రెండు మాత్రమే వచ్చాయి. దింతో నిబంధనల మేరకు మానాలకు డ్రా తీయలేదు.
ఎక్సైజ్ అధికారులకు కలెక్టర్ అభినందన
డ్రాకు పకడ్బంది ఏర్పాట్లు చేయడంతో డ్రా సజావుగా జరిగింది. పట్టణ సి.ఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పకడ్బంది ఏర్పాట్లు చేశారు. డ్రా కు పకడ్బందిగా ఏర్పాట్లు చేసిన అధికారులకు కలెక్టర్ అభినందించారు.