Highlights
16 నుండి 24వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు
హైదరాబాద్‌కు చెందిన భక్తురాలు పరదాలు విరాళం
తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్‌కు చెందిన ప్రసన్నారెడ్డి అనే భక్తురాలు టిటిడికి అనుబంధంగా ఉన్న తిరుపతిలోని శ్రీకోదండరామస్వామివారి ఆలయానికి 29 పరదాలు, కురాళాలు విరాళంగా సమర్పించారు. వీటి విలువ రూ.3 లక్షల వరకు ఉంటుంది. మూడేళ్లుగా బ్రహ్మోత్సవాల ముందుగా దాత పరదాలు, కురాళాలు విరాళంగా అందిస్తున్నారు. కాగా శ్రీకోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలకు గురువారం సాయంత్రం 6.30 గంటలకు సేనాధిపతి ఉత్సవం నిర్వహిస్తారు. రాత్రి 7.15 నుండి 8.30 గంటల వరకు శాస్త్రోక్తంగా అంకురార్పణ చేపడతారు. ఆలయంలో ఈ నెల 16 నుండి 24వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ఆలయంలో చలువపందిళ్లు, ప్రత్యేకంగా క్యూలైన్లు ఏర్పాటుచేసి రంగవల్లులు తీర్చిదిద్దారు. ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి ఝాన్సీ పర్యవేక్షణలో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు వేగవంతంగా జరుగుతున్నాయి.
బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :
తేదీ ఉదయం సాయంత్రం
16-03-2018(శుక్రవారం) ధ్వజారోహణం పెద్దశేష వాహనం
17-03-2018(శనివారం) చిన్నశేష వాహనం హంస వాహనం
18-03-2018(ఆదివారం) సింహ వాహనం ఉగాది ఆస్థానం/
ముత్యపుపందిరి వాహనం.
19-03-2018(సోమవారం) కల్పవృక్ష వాహనం సర్వభూపాల వాహనం
20-03-2018(మంగళవారం) పల్లకీ ఉత్సవం గరుడ వాహనం
21-03-2018(బుధవారం) హనుమంత వాహనం వసంతోత్సవం/గజ వాహనం
22-03-2018(గురువారం) సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం
23-03-2018(శుక్రవారం) రథోత్సవం అశ్వవాహనం
24-03-2018(శనివారం) పల్లకీ ఉత్సవం/చక్రస్నానం ధ్వజావరోహణం.