సముద్రంలో బాలీవుడ్ యాక్టర్.. రోమాన్స్
ముంబై,
బాలీవుడ్ నటుడు, మోడల్ మిలింద్ సోమన్ తన భార్య అంకితా కోన్వార్తో కలిసి ఐస్‌ల్యాండ్‌లో ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడి ఫేమస్ బ్లూ లగూన్లో వీరిద్దరూ కలిసి రొమాంటిక్‌గా దిగిన ఫొటోలను మిలింద్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో ఇవి కాస్తా వైరల్ అవుతున్నాయి. ‘ఐస్‌ల్యాండ్‌లోని బ్లూ లగూన్లో మేం ఇలా.. బయట వాతావరణం ఉష్ణోగ్రత 3 డిగ్రీలు ఉంది. కానీ ఈ లగూన్లో 30 డిగ్రీలు వెచ్చగా ఉంది’ అని పేర్కొన్నారు. వీరి ఫొటోలపై నెటిజన్లు కామెంట్లు చేస్తూ చూడముచ్చటైన జంట అని రాస్తున్నారు.53 ఏళ్ల వయసులోనూ మిలింద్ సోమన్ ఎంతో హ్యాండ్సమ్గా ఉంటారు. అందుకే ఆయనకు బాలీవుడ్లో విపరీతమైన క్రేజ్ ఉంది. కానీ ఎప్పుడైతే ఆయన కూతురు వయసున్న అంకితా కోన్వార్‌ను పెళ్లి చేసుకున్నారో అప్పటినుంచి వీరిద్దరూ హాట్ టాపిక్‌గా మారారు. గతేడాది మిలింద్, అంకితా పెళ్లి చేసుకున్నారు. మిలింద్కు అంతకుముందే పెళ్లైంది. కానీ కొన్ని కారణాల వల్ల వారిద్దరూ విడిపోయారు. ఆ తర్వాత మిలింద్ అంకితను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారని తెలిసి ఫ్యాన్స్ షాకయ్యారు. తనకంటే చిన్న వయసున్న అమ్మాయితో ప్రేమ, పెళ్లేంటి? అని ఏకిపారేశారు.సమాజం ఎప్పుడూ ఇతరులను వేలెత్తి చూపుతూనే ఉంటుందని, ప్రేమకు వయసుతో సంబంధం లేదని మిలింద్ చాలా సార్లు తెలిపారు. ఇప్పుడు వీరిద్దరూ తమ వైవాహిక జీవితాన్ని ఆనందంగా గడుపుతున్నారు. కార్తి నటించిన తొలి చిత్రం ‘ఆవారా’లో మిలింద్ విలన్ పాత్రలో నటించారు. బాలీవుడ్‌లోనూ ఎన్నో సినిమాల్లో నటించారు. ఆయన చివరిగా ‘ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్’ అనే వెబ్ సిరీస్‌లో నటించారు. అంతేకాదు ఆయన ప్రపంచంలోనే నెంబర్ వన్ మారథాన్ రన్నర్లలో ఒకరు. అంకితా కూడా తన భర్తతో కలిసి వరల్డ్ లాంగెస్ట్ మారథాన్ ఈవెంట్లో పాల్గొన్నారు. ఐదు పదుల వయసులోనూ మిలింద్ నిర్విరామంగా 100 పుషప్స్ చేయగలరు. ఆయన సినిమాలకంటే ఫిట్నెస్ పరంగానే బాగా పాపులర్ అయ్యారు.