YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

ఆర్టీసీ ఉద్యోగులతో చర్చలు జరపండి... హైకోర్టు ఆదేశం

ఆర్టీసీ ఉద్యోగులతో చర్చలు జరపండి... హైకోర్టు ఆదేశం

ఆర్టీసీ ఉద్యోగులతో చర్చలు జరపండి... హైకోర్టు ఆదేశం
హైద్రాబాద్, 
ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. శుక్రవారం ఆర్టీసీ కార్మికుల సమ్మెపై విచారణ జరిపిన హైకోర్టు.. అక్టోబర్ 19న ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. రేపు ఉదయం 10.30 గంటలకు ఆర్టీసీ కార్పొరేషన్, కార్మికులతో చర్చలు జరపాలని న్యాయస్థానం సూచించింది. చర్చలకు వెళ్లాలని ప్రభుత్వానికి హైకోర్టు పదే పదే సూచనలు చేసినప్పటికీ... సర్కారు నుంచి స్పందన లేకపోవడంతో.. హైకోర్ట్ ఈసారి టైం కూడా ఫిక్స్ చేసింది.చర్చలకు వెళ్లేందుకు సిద్ధమని ఆర్టీసీ జేఏసీ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. చర్చలు విఫలమైతే సమ్మె యథావిధిగా కొనసాగిస్తామని ఆయన చెప్పారు. చర్చల విషయంలో తమకు ఎలాంటి ప్రమేయం లేదని అడ్వకేట్ జనరల్ స్పష్టం చేశారు.సమస్యల పరిష్కారానికి చర్చలు జరుపుతుండగానే ఆర్టీసీ కార్మిక సంఘాలు సమ్మెకు వెళ్లాయని అడ్వకేట్ జనరల్ హైకోర్టు‌కు తెలిపారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని ఆయన చెప్పారు. చర్చల విషయంలో తమ ప్రమేయం ఏమీలేదన్నారు. అడ్వకేట్ జనరల్ వ్యాఖ్యల పట్ల హైకోర్టు స్పందించింది. యూనియన్ నేతలతో చర్చలు జరపాలని కార్పొరేషన్‌ను ఆదేశిస్తామని హైకోర్టు తెలిపింది.అంతకు ముందు ఆర్టీసీకి ఎండీని ఎందుకు నియమించలేదని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ప్రజలు శక్తిమంతులని... వారు తిరగబడితే ఎవరూ ఆపలేరని సర్కారును హెచ్చరించింది. ఆర్టీసీ కార్మికుల సమ్మెను ఆపడానికి రెండు వారాలుగా మీరేం చేశారని సర్కారును ప్రశ్నించింది.
ఎండీ నియామకం ఆలస్యం ఎందుకు
ఆర్టీసీ సమ్మెపై విచారణ జరిపిన హైకోర్టు.. ఆర్టీసీకి ఎండీని ఎందుకు నియమించలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దీనికి సర్కారు బదులిస్తూ.. ఇప్పటికిప్పుడు ఎండీని నియమించడం ద్వారా సమస్య పరిష్కారం కాదని తెలిపింది. సమర్థవంతమైన అధికారి ఇంఛార్జీగా ఉన్నారని వివరణ ఇచ్చింది. ప్రభుత్వ సమాధానంతో న్యాయమూర్తి సంతృప్తి చెందలేదు. సమర్థుడైన అధికారి ఇంఛార్జీగా ఉంటే.. ఆయన్నే ఎండీగా ఎందుకు నియమించలేదని ప్రశ్నించింది. ఆర్టీసీ కార్మికుల సమ్మెను ఆయన ఎందుకు ఆపలేకపోయారని ప్రశ్నించిందప్రజలు తిరగబడితే ఎవరూ ఆపలేరన్న హైకోర్టు.. ఆర్టీసీ సమ్మెకు మరికొందరు మద్దతు తెలిపితే ఆందోళనలను ఎవరూ ఆపలేరని న్యాయస్థానం తెలిపింది. ఆర్టీసీ కార్మికుల ఆందోళనలను ప్రభుత్వం ఎందుకు ఆపలేకపోతోందని ప్రశ్నించింది. రెండు వారాలుగా ఆందోళనలు జరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని నిలదీసింది.ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన 44% స్పెషల్ ఫిట్‌మెంట్ ఇచ్చామని, తర్వాత 16 శాతం ఐఆర్ ఇచ్చామని.. మొత్తం కలిపితే 67 శాతం జీతాలను పెంచామని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. సమైక్య రాష్ట్రంలో ఆర్టీసీ బలోపేతం కోసం రూ.750 కోట్లు ఖర్చు పెడితే, తెలంగాణా ప్రభుత్వం రూ. 4 వేల కోట్లు ఖర్చు పెట్టిందని అడ్వకేట్ జనరల్ తెలిపారు. రాష్ట్రం ఏర్పడ్డాక 2500 కొత్త బస్సులను కూడా కొనిచ్చిన విషయాన్ని ఆయన న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు.

Related Posts